Monthly Archives: August 2026

డిసెంబరు 1 నాటికి ‘95-95-99’ లక్ష్యాల సాధన

-ఎయిడ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ధ్యేయం -వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు -60 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి -డిజిటల్‌ పర్యవేక్షణకు ‘సురక్ష’ డ్యాష్‌బోర్డ్‌ ఆవిష్కరణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, 2026 డిసెంబరు 1 నాటికి నిర్దేశిత ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ వెల్ల‌డించారు. ఈ సాధ‌న‌లో యువ‌త‌తో పాటు …

Read More »

గంజాయి రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా

-గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం -గంజాయి సమాచారం అందిస్తే బహుమతి – వివరాలు పూర్తిగా గోప్యం -ఈగల్ ఛాలెంజ్‌లో భాగంగా 1972కు సమాచారం అందించండి -విజయవాడ అంటే ‘బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్’ అనే నానుడికి స్వస్తి పలకాలని హితువు -గంజాయి సేవించారనే నిర్ధారణ లేకుండా ఎలాంటి సంఘటనలనూ గంజాయితో ముడిపెట్టవద్దు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో నిరంతరాయంగా …

Read More »

ఏపీఎస్‌ఆర్టీసీలో మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు, ఏపీఎస్‌ఆర్టీసీ మైనారిటీ విభాగం గౌరవ అధ్యక్షుడు సయ్యద్ భాషా తెలిపారు. విజయవాడ బుధవారం గాంధీనగర్‌ స్థానిక ప్రెస్ క్లబ్ లో మైనారిటీ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. మైనారిటీ ఉద్యోగులకు సెలవులు ప్రయాణ అనుమతులు రంజాన్ సమయంలో విధుల విషయంలో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదాలు ఇతర సమస్యలను మతపరమైన కోణంలో కాకుండా అందరినీ …

Read More »

ఆటోనగర్ అభివృద్ధి లక్ష్యంగా ‘ఇర్ఫాన్ ప్యానెల్’ రంగప్రవేశం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మహమ్మద్ ఇర్ఫాన్ నాయకత్వంలో నూతన ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ (ఏటిఏ) అధ్యక్షుడు రాజరాల వెంకటరమణారావు (బాబ్జి) ప్రకటించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్యానెల్ అభ్యర్థులను పరిచయం చేస్తూ గత పాలకవర్గ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. అభివృద్ధి శూన్యం అవినీతి మయం 2014 నుంచి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పాలకవర్గం తమ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదని రమణారావు విమర్శించారు. …

Read More »

ఇంద్రకీలాద్రిపై రికార్డు స్థాయిలో ముగిసిన ‘ఆషాఢ సారె ఉత్సవాలు

-నెల రోజుల్లో 6 లక్షలకు పైగా భక్తుల సారె సమర్పణ – గత దశాబ్ద కాలంలోనే ఆల్ టైమ్ రికార్డ్ -4 రాష్ట్రాల నుండి తరలివచ్చిన సారె బృందాలు.. తొలిసారిగా నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయం ​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జులై 15 నుండి ఆగస్టు 12 వరకు కన్నులపండువగా జరిగిన ‘ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాలు’ బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసమంతా ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన …

Read More »

యువశక్తి సమాజ సేవకు అంకితం కావాలి

-అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో శ్రమదానం -మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన యువత జీవితాలతో వైసీపీ చెలగాటం: గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత కేవలం రాజకీయాలు, ఉద్యోగాలు, చదువులకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావాలని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఇంటర్నేషనల్ యూత్ దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో 11వ డివిజన్ పరిధిలోని దొంతిరెడ్డి మల్లేశ్వరి పార్కులో టీడీపీ …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.ఐ.ఆర్‌లో భాగంగా గుంటూరు నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించబడుతుందని, సర్ సర్వే సమయంలో అందుబాటులో లేకపోవడం, స్పందించని వారి ఓట్లు మాత్రమే ముసాయిదా జాబితాలో లేవని, అటువంటి 62,790 మందికి నోటీసులు అందించనున్నామని తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీనలలో భాగంగా నియోజకవర్గాల …

Read More »

ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కువగా ఉండే ప్రధాన డ్రైన్లలో కన్వేయర్ బెల్ట్ లను 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని, నగరంలో త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో సంబంధిత ఏ.ఈ లు, వార్డు కార్యదర్శులు ఫీల్డ్ లో ఉండి నూరు శాతం త్రాగునీటి శ్యాంపుల్స్ సేకరించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలకసంస్థలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో …

Read More »

రెవెన్యూ సేవలన్నిటికీ ఇక ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు

-పారదర్శకత, గడువులోగా సేవలే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు –కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పౌర సేవల్లో పారదర్శకత పెంచేందుకు మరియు వేగవంతమైన సేవలు అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు అందించే ఆస్తిపన్ను విధింపు, ఖాళీ స్థలాల పన్ను, పేరు మార్పు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, సబ్‌డివిజన్, అమాల్గమేషన్, పన్ను మినహాయింపులు వంటి అన్ని రకాల రెవెన్యూ సేవలన్నిటికీ ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, ఎలాంటి మాన్యువల్ ప్రక్రియకూ ఆస్కారం లేదని గుంటూరు నగర కమిషనర్ …

Read More »

ఈ-ఆటో తప్పనిసరిగా రోజుకు 1000 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు వార్డుల వారీగా కేటాయించిన ఈ-ఆటోలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి ఈ-ఆటో తప్పనిసరిగా రోజుకు 1000 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం శ్యామలా నగర్, రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను కమిషనర్ నేరుగా పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ-ఆటోలు తప్పనిసరిగా ఉదయం 6 …

Read More »