అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ టెట్ జూన్ 2026 సంబంధించి పరీక్షలు 05.08.2026 నుండి నిర్వహించబడుతున్నవి. ఈరోజు అనగా 05.08.2026 ఉదయము మరియు మధ్యాహ్నము రెండు సెషన్ లలో కూడా పేపర్ 2a – లాంగ్వేజ్ (తెలుగు) పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఉదయము 57 పరీక్షా కేంద్రాలలో 8148 అభ్యర్థుల గాను 7453 మంది అభ్యర్థులు (91.4%), మధ్యాహ్నము 42 పరీక్షా కేంద్రాలలో 5801 అభ్యర్థుల గాను 5324 మంది అభ్యర్థులు (91.78%) పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈరోజు ఉదయం సెషన్ …
Read More »Monthly Archives: August 2026
సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాల, డైట్ చార్జీల కోసం ₹137.98 కోట్లు విడుదల
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వివిధ కేడర్ల సిబ్బంది, ఉపాధ్యాయుల జూన్, జూలై నెలల వేతనాలతో పాటు డైట్ చార్జీల చెల్లింపుల కోసం రూ. 137.98 కోట్లు నిధులను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో, రెండు నెలల బకాయి వేతనాలు, …
Read More »సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో …
Read More »పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను ఈ నెల 15లోపు పరిష్కరించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వార్ద్ సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్ లలో లే అవుట్ రెగ్యులేషన్ …
Read More »ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో పట్టణ ప్రణాళిక, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, ట్రాన్స్‌కో, సీపీడీసీఎల్ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్ నగర ట్రాఫిక్ రద్దీని …
Read More »ఆగస్టు 17 నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధాన్ని కఠినంగా అమలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆగస్టు 17 నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం వార్డ్ సచివాలయాల వారీగా ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు, ప్రజారోగ్య అధికారులు, కార్మికులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి …
Read More »సూరంపల్లిలో అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఆగ్రహం
-సూరంపల్లిలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -సూరంపల్లి అభివృద్ధికి ఇప్పటివరకు రూ.2.16 కోట్ల పనులు మంజూరు చేశాం: యార్లగడ్డ -అదనంగా మరో రూ.55 లక్షల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం: ఎమ్మెల్యే -గన్నవరం నియోజకవర్గంలో 9,600కు పైగా ప్రజా సమస్యలు పరిష్కరించాం: యార్లగడ్డ -పంచాయతీ ఖాతాలో నిధులు ఉన్నా గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది: ఎమ్మెల్యే -సూరంపల్లిలో పనిచేస్తున్న అధికారులపై చర్యలకు …
Read More »‘మార్పు కోసం’ సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘మార్పు రావాలి – మార్పు కావాలి అనే నినాదంతో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల ఆరవ తేదీ నుండి 15వ తేదీ వరకు విజయవాడ నగర వ్యాప్తంగా జరగనున్న పాదయాత్రలను జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 46, 47, 48, 51 డివిజన్ల బాధ్యుల సమావేశం ఈరోజు కేఎల్ రావు పార్క్ వద్దగల కనకయ్య అప్పారావు గ్రంధాలయంలో జరిగింది. ఈ సమావేశంలో …
Read More »మధ్యవర్తిత్వంతో వివాదాలకు త్వరితగతిన పరిష్కారం – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి
-మీడియేషన్ ఫర్ నేషన్ 3.0’ను విజయవంతం చేయాలి – సెప్టెంబర్ 12 నేషనల్ లోక్ అదాలత్‌కు విస్తృతంగా కేసులు రిఫర్ చేయాలని సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మీడియేషన్) అత్యంత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి అన్నారు. ప్రతి న్యాయమూర్తి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి, …
Read More »పిల్లల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమిష్టి బాధ్యతతో పనిచేయాలి
-లోటుపాట్లను సరిదిద్ది చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా కృష్ణాను తీర్చిదిద్దాలి -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు, చల్లా మధుసూధన రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు తమ ఉమ్మడి బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు, చల్లా మధుసూధన రావు అధికారులను ఆదేశించారు. కృష్ణా …
Read More »
Prajavartha Online Telugu News