Breaking News

అభివృద్ధి జరుగుతున్నటువంటి ఎక్సెల్ ప్లాంట్ ను పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను సోమవారం ఉదయం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు జరుగుతున్న పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు. ప్లాంట్ ఆవరణలో ఉన్న ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, ఆఫీసు బిల్డింగ్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్, వెహికల్ పార్కింగ్ వంటి ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. అదేవిధంగా ఎక్సెల్ ప్లాంట్ కు రోజుకు ఎంత చెత్త వస్తుంది అని కంప్యూటర్ రూమ్ నందు సిస్టమ్ లో తనిఖీ చేసి మరియు చెత్త వేయింగ్ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. ఎంట్రేన్స్ గేటు దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించి పార్కింగ్ ఫ్లోరింగ్ రాళ్ళను ఎంట్రేన్స్ గేటు దగ్గర ఏర్పాటు చేయాలనీ మరియు ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంలో ప్లాంట్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్,, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *