Breaking News

పి.డి.ఎస్‌ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్‌ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా పి.డి.ఎస్‌బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి అన్నారు.

శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామ సమీపములో అశోక్ లేలాండ్ ఎకోమెట్ స్టార్ వాహనం నంబర్ AP39 UE 9333లో పి.డి.ఎస్‌రేషన్ బియ్యంతో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనంను అదుపులోకి తీసుకోవడం జరిగింది.తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 122 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 6100 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించటమైనది. సదరు వాహన యజమాని వెలుగుల కృష్ణ మరియు అతని భాగస్వామి వెలుగుల గురయ్య @ బాబ్జి, R/o B.ప్రత్తిపాడు ఆదేశాల మేరకు PDS బియ్యాన్ని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామం నుండి గొల్లప్రోలు మండలం బి-ప్రత్తిపాడు గ్రామానికి రవాణా చేస్తున్నట్లు వాహన డ్రైవర్ శ్రీ కరణం సద్గురు మూర్తి, S/o వీరాజు తెలియజేశారు. సదరు పి.డి.ఎస్‌ బియ్యంను అతని యజమానులు కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కార్డుదారుల నుండి రూ.23/-లకు కొనుగోలు చేసి, బి-ప్రత్తిపాడు గ్రామ పరిధిలోని బ్రిక్స్ కార్మికులకు, చేపల చెరువులకు 26/-లకు విక్రయిస్తున్నారని తెలిపియున్నాడు. సదరు పి.డి.ఎస్‌ బియ్యంను అక్రమముగా తరలించుట కారణముగా సుమారు రూ 31,73,872/- లు విలువ గల 6100 కేజీల రేషన్ బియ్యంను మరియు పైన తెలిపిన వాహనంను సివిల్ సప్లయ్స్ అధికారులు, రాజానగరం వారు సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి సదరు పి.డి.ఎస్‌(రేషన్ బియ్యం) ఓనర్లు, వాహనం డ్రైవర్ మరియు సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనదన్నారు.

ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. శ్రీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి, మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్‌(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్‌(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ నాగ వెంకటరాజు, తూర్పుగోదావరి పౌర సరఫరాల అధికారి భాస్కర్, రాజానగరం సి.ఎస్.డి.టి సుందర్, కానిస్టేబుల్స్ లోవరాజు, కిషోర్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *