Tag Archives: rajamendri

భూముల వివరాలు పై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోకవరం మండలంలోని మూడు గ్రామాల్లో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా భూసేకరణ కోసం భూములను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో రాజమండ్రి ఆర్డీవో, గోకవరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందితో భూముల వివరాలు పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కోసం ఉచితంగా స్థలాలు అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చొరవతో …

Read More »

సెషన్స్ కోర్టు-కమ్-స్పెషల్ కోర్ట్ ఫర్ మహిళలపై అఫెన్స్ ఆఫ్ అఫెన్స్ కోర్టు భవనానామ్ ప్రారంభం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా  ఈ రోజు రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో రూ.37.80 లక్షలతో నిర్మించిన 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు-కమ్- మహిళలపై అఫెన్స్ కొరకు ప్రత్యేక కోర్ట్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా  ప్రారంభించారు. శనివారం ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణం లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు –  జస్టిస్ …

Read More »

నగర పారిశుధ్యం లో ప్రజల సహకారం ముఖ్యం

-రోడ్ల పై ఎక్కడా చెత్త ఉండరాదు -కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ స్థానిక రెండవ వార్డు, జైల్ రోడ్, తదితర ప్రాంతాలను పరిశీలించారు. పౌరులంతా తమ ఇళ్లలోని చెత్తను చెత్త సేకరణ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త లను వేరు చేసి అందజేయాలన్నారు. నగరంలో పారిశుధ్యం కోసం వేస్తున్న చర్యలకు ప్రజల సహకారం అందించాలని, బయట ఎక్కడ చెత్త వేయరాదని ,ప్లాస్టిక్ కవర్లో పెట్టి రోడ్లపై పడేయరాదన్నారు. …

Read More »

ఇన్ కమ్ రిటర్న్స్ దాఖలు చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి

-జనవరి 22 నెల ఐ టి చెల్లింపులు డి టి ఎ టాన్ లో చూపడం జరిగింది -డి టి ఎ ఓ.. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యక్తిగతంగా దాఖలు పరిచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 2022 నెలకు సంబంధించి చెల్లించిన ట్యాక్స్ వివరాలు HYDD00408C టాన్ నుండి పొంద వచ్చునని తూర్పు గోదావరి జిల్లా ఖజానా మరియు ఖాతాల అధికారి ఎన్. సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జనవరి 2022 …

Read More »

నగరంలో రహదారుల మరమ్మత్తులపై ఫోటో ప్రదర్శన

-ఈరోజు నుంచి 3 రోజులపాటు ప్రజల సందర్శార్థం -ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో జరిగే తరహా అభివృద్ధి స్థాయి లో మరెక్కడా నిర్ణయాత్మక మైన పనులు జరగటం లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు. శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో రహదారుల మరమ్మతు లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ని రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి , …

Read More »

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం… :  మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరికి వరదలు వస్తాయని ముందు చూపుతోనే ఆలోచించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 12 వ తారీఖున జిల్లా యంత్రాంగాలు ముందస్తు గా సిద్దం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ రూడా చైర్ పర్సన్ ఎం షర్మిలా రెడ్డి, స్థానిక నాయకులు చందన నాగేశ్వర్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 జిల్లాలలో …

Read More »

హుకుంపేట, సావిత్రి నగర్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎంపీ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు గోదావరి వరదలకు ముంపుకు గురి అయిన హుకుంపేట, సావిత్రి నగర్ పరిసర ప్రాంతాలను  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ మరియు రూరల్ కోఆర్డినేటర్  చందన నాగేశ్వర్ సందర్శించారు. ముంపుకు గురి అయిన ప్రాంతాలలోని నివాసాల వద్దకు వెళ్లి నివాసితులు తో స్వయంగా మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను విని సంబంధిత అధికారులను తీసుకుని నిలువ వున్న నీటిని యుద్ద ప్రాతిపదిక మీద …

Read More »

జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున డా. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు..

-టోల్ ఫ్రీనెంబరు 1962 కు ఫోన్ చేస్తే చాలురైతు ముంగిటే సేవలు.. -జిల్లాలో ఇప్పటి వరకు 35 గ్రామాల్లో 158 పశువులకు అత్యవసర వైద్యసేవలు… -జేడీ.. డా. ఎస్ టి జి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలను రైతాంగం (పశుపోషకులు) సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టరు డా.ఎస్.టి.జి.సత్య గోవింద్ అన్నారు. బుధవారం స్థానిక పశుసంవర్థక శాఖ కార్యాలయంలోడా.వైఎస్సార్ సంచార …

Read More »

ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవచేర్ల ఇండస్ట్రియల్ కాలనీ లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు స్థలాలు కేటాయింపు కేటగిరీ వారీగా ఏర్పాటు చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో కలవచేర్ల ఇండస్ట్రియల్ కాలనీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన ప్రతినిధులతో జిల్లా పరిశ్రమల శాఖ, ఏ పి ఐ ఐ సి ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో నూతన పరిశ్రమల …

Read More »

జిల్లా వ్యాప్తంగా జూలై 18 సోమవారం రోజున నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు…

-జిల్లా కలెక్టర్ మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం వర్షాలు వరదలు మూలంగా ఈ వారం జూలై 18 న నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ , డివిజన్ పరిధిలో, మండల పరిధిలో, సచివాలయ పరిధిలో ఈ వారం స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు. కావున స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలు గమనించాలని ఆమె …

Read More »