Breaking News

Daily Archives: February 11, 2025

జిఎస్‌డిపి సమీక్షా వివరాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విభజన అనంతరం 2014-15 నుండి 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తలసరి ఆదాయంలో సమానంగా పోటీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ 13.21% వృద్ధిని నమోదు చేయగా, తెలంగాణ 13.37% వృద్ధిని సాధించింది, కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండేది. జాతీయ సగటు 9.75%తో పోలిస్తే రెండు రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. అయితే, 2019-20 నుండి 2023-24 మధ్య రెండు రాష్ట్రాల మధ్య భారీ తేడా వచ్చింది. జాతీయ సగటు 8.16%కి తగ్గినా, తెలంగాణ కొంతవరకు నిలబడింది, …

Read More »

ఇన్ని సవాళ్లెదుర్కోవడం ఇదే మొదటిసారి

-గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది -కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారిమళ్లించారు -2047 నాటికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలి…ఆ లక్ష్యంగా పని చేయాలి -తెలుగుజాతిని నెంబర్-1 కావాలన్నది నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీయే ఆలోచన -ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు…మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు -మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగు -మంత్రులు, అధికారులుగా ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం…లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పని చేద్దాం. -మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమీక్షలో …

Read More »

వాట్సాప్‌లోనే అన్ని ధృవ‌ప‌త్రాలిస్తాం

-క్యూఆర్ కోడ్ స‌హిత‌ డిజిట‌ల్ రేష‌న్ కార్డులివ్వ‌బోతున్నాం -శాఖ‌ల‌న్నీ డేటా లేక్‌తో అనుసంధానం కావాలి -ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరుల‌కు కావాల్సిన అన్ని ర‌కాల ధృవ‌ప‌త్రాలు పొందేలా కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సీమ్‌లెస్ స‌ర్వీసులు అంద‌జేయాల‌న్న‌దే త‌మ ఆశ‌య‌మ‌న్నారు. మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా ఆయ‌న వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అనేది …

Read More »

అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు

-అటవీ శాఖ స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి అమ‌రావ‌తి,అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్ద ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు మరియు కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా అటవీ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మాసంతానికి సాధించిన ప్రగతి …

Read More »

అన్ని సేవ‌లూ వాట్సాప్‌లోనే క‌ల్పించండి

-ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోండి -రాబోయే రోజుల్లో ప‌నుల కోసం ప్ర‌జ‌లు కార్యాల‌యాల‌కు రావాల్సిన అవ‌స‌ర‌ముండ‌దు -అన్ని సేవ‌లూ వాట్సాప్‌లోనే క‌ల్పిస్తాం -యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడండి -ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ స‌ర్వ‌ర్‌ కెపాజిటీ పెంచుకోవాలి -ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచ‌న‌ -వారం రోజుల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 2.64 ల‌క్ష‌ల లావాదేవీలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లెవ్వ‌రూ కూడా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వ‌చ్చే అవ‌స‌రం లేకుండా, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ కూడా వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాల‌ని …

Read More »

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం…1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు

-సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా …

Read More »

ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెర‌గాలి

-ఆర్థికేత ఫైళ్లు పెండింగ్‌లో ఉండ‌కూడ‌దు -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో భాగంగా వివిధ శాఖ‌ల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్సు జ‌రుగుతున్న క్ర‌మం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాల‌న్నారు. ఫైళ్లు …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో 340 మొబైల్ వెటర్నరీ యూనిట్లు – రూ84.09 కోట్లు నిధులు మంజూరు

-కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వెల్ల‌డి -మొబైల్ వెటర్నరీ యూనిట్లు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర‌ ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) సంఖ్యను గణనీయంగా పెంచింది. పశువైద్యశాలలు , డిస్పెన్సరీల స్థాపన పటిష్టత – మొబైల్ వెటర్నరీ యూనిట్ (ESVHD-MVU) ప‌థ‌కం కింద దేశ‌వ్యాప్తంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 4340 యూనిట్లు మంజూరు చేయగా, …

Read More »

గుణ‌దల మేరీమాత‌ను ద‌ర్శించుకున్న కేశినేని వెంక‌ట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ :దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఆల‌యాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌నయుడు తెలుగు దేశం పార్టీ యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ సందర్శించారు. గుణ‌ద‌ల మేరీ మాత ఉత్స‌వాలు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గుణ‌ద‌ల చ‌ర్చిలో కేశినేని వెంక‌ట్ కొవ్వొత్తులు వెలిగించి మేరీమాత ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గుణ‌ద‌ల పుణ్య‌క్షేత్రం రెక్టార్ యేలేటి విలియం జ‌య‌రాజు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేశినేని వెంక‌ట్ కు ఆశీర్వచనాలు అందించారు. …

Read More »

నవ చేతన తో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్

-విద్యార్థులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సుజనా ఫౌండేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నానాటికి పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు కే బీ ఎన్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ , క్రిస్ప్, మరియు ఎస్ పి వై ఎమ్ , అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో ఆవరణలో మంగళవారం డ్రగ్ అవేర్నెస్ మరియు లైఫ్ స్కిల్స్ పై అవగాహన …

Read More »