Breaking News

Daily Archives: April 23, 2025

జిల్లా నైపుణ్యాభివృద్ధి తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఏప్రియల్ 25 న జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలో ఏప్రియల్ 25 న మెగా జాబ్ మేళా యువతకు ఉద్యోగావకాశాలు తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున APSSDC & Govt. College (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా **రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం) ••లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన మచిలీపట్నం ఎంపి బాలశౌరి

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అదేసమయంలో నేను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో ఉండటం జరిగింది. ఇటువంటి సంఘటన జరగడం పట్ల ఎంపి బాలశౌరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో తెలుగురాష్ట్రాలకు చెందిన జెఎస్ చంద్రమౌళి మరియు మధుసూదన్  ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు మా జనసేన …

Read More »

విద్యార్థిని /విద్యార్థులు పాస్ అయి 95 % పరీక్షా ఫలితాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా, సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో నడపబడుచున్న (21) ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో 2024-25 విద్యా సంవత్సరమునకు సంబంధించి, ది.23-04-2025వ తేదిన బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన పదోవ తరగతి పరీక్షా ఫలితాలలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న మొత్తం 134 మంది విద్యార్థిని /విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా (127) మంది విద్యార్థిని /విద్యార్థులు పాస్ అయి 95 % పరీక్షా ఫలితాలు సాధించుట జరిగినది. అలాగే (16) హాస్టళ్లలోని విద్యార్థిని /విద్యార్థులు వంద శాతం …

Read More »

బుద్ధ విగ్రహాలకు స్వాగతం పలికిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : థాయిలాండ్‌ నుండి వచ్చిన బుద్ధ విగ్రహాలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో బుధవారం స్వాగతం పలికారు. బుద్ధ ప్రాజెక్టులో భాగంగా ఘంటశాలలో ఏర్పాటు చేసేందుకు థాయిలాండ్ నుండి వచ్చిన బుద్ధ భగవానుని విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్‌ లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించే …

Read More »

మచిలీపట్నంకు సరికొత్త శొభగులు అద్దుతాం

-డ్రైన్లలో పూడిక తొలగింపుకు రూ.171 కోట్లు -పీపీపీ పద్దతిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు -శ్మశానాల అభివృద్ధికి డీపీఆర్ లు సిద్ధం -మాతృభూమికి సేవ చేయడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం హర్షనీయం -డంపింగ్యార్డు స్థానంలో అక్టోబర్ 2 నాటికి నూతన పార్కు సిద్ధం చేస్తాం -స్వదేశీదర్శన్ క్రింద రూ.120 కోట్ల ప్రపోజల్స్ పంపించాం -మచిలీపట్నం అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంను సరికొత్త రూపు సంతరించడానికి బ్యూటిఫికేషన్లో భాగంగా స్థానికతకు, కల్చర్కు పెద్దపీట వేస్తూ గోల్డ్ కవరింగ్, కళంకారీ, …

Read More »

ఉగ్రవాదుల దాడి అత్యంత హేయం

-ఈ ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తీవ్ర మనో వేదనకు గురయ్యారు -జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు  -హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె.నాగబాబు స్పష్టం చేశారు. ప్లకార్డుల ప్రదర్శన ద్వారా వెల్లడించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు …

Read More »

ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో అంతా ఖండించాలి

-కశ్మీర్ లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్ర కుట్ర -ప్రధాని మోదీ  చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే దాడులు -క్లిష్ట సమయంలో కలసికట్టుగా నడవాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు – పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు పార్టీ తరఫున మూడు రోజుల సంతాప దినాలు -జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -పహల్గాం ఉగ్ర దాడి మృతులకు సంతాపంగా మంగళగిరిలో జనసేన పార్టీ కొవ్వొత్తుల …

Read More »

లూపింగ్ నెట్వర్క్ డిజైన్ తో కొండ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్న మైసూర్ కార్పొరేషన్

-క్షేత్ర స్థాయిలో మైసూర్ మంచినీటి శుద్ధి చేయు ప్లాంట్ యొక్క నిర్వహణ విధానం పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొండ ప్రాంతాలకు లూపి నెట్వర్క్ డిజైన్ తో నీటి సరఫరా చేస్తున్నట్టు మైసూరు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ డెవలప్మెంట్ కే జె సింధు తెలిపారు. దక్షణాది రాష్ట్రాల స్టడీ టూర్ లో భాగంగా ఫ్లోర్ లీడర్ శ్రీ వెంకట సత్యనారాయణ పర్యవేక్షణ లో కార్పొరేటర్ల బృందం బుధవారం మైసూర్ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశమునకు మైసూర్ …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ లో పెరిగిన నీటి శుద్ధత, త్రాగునీటి సరఫరా

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ హెడ్ బార్డర్ వర్క్స్ లో నీటి సుజాత త్రాగునీటి సరఫరా పెరిగిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం వన్ టౌన్ లో గల హెడ్ వాటర్ వర్క్స్ సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ లో ప్రత్యేక చర్యలు చెప్పటారని, ప్రతి వేసవిలో, ఉష్ణోగ్రతలు పెరిగి, సూర్యప్రకాశం అధికంగా …

Read More »

నగరంలో నుండి నగర శివారు వరకు ఉండే డ్రైన్ లన్ని కచ్చితంగా డీసిల్టింగ్ చెయ్యాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నుండి నగర శివారు వరకు ఉండే డ్రైన్ లన్ని కచ్చితంగా డీసిల్టింగ్ చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎక్సెల్ ప్లాంట్, రాధానగర్ డ్రైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ముస్తాబాద్ రోడ్ ఔట్ ఫాల్ డ్రైన్, సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్సెల్ ప్లాంట్ లో వ్యర్ధాలు …

Read More »