– ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కావడానికి వీల్లేదు – ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి – సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలని, ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కాకుండా ప్రతిఒక్కరిపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సహాయ సాంఘిక సంక్షేమ, వసతి గృహ …
Read More »Daily Archives: February 3, 2025
వికసిత్ భారత్‌కు కేంద్ర బడ్జెట్‌తో బాటలు
-ఏపీకి ఆక్సిజన్ అందించేలా బడ్జెట్ కేటాయింపులు -గత విధ్వంస పాలనతో 30 ఏళ్లు వెనకపడిన ఏపీ -ఇప్పుడే నిలదొక్కుకుంటున్నాం.., 15% వృద్ధి రేటు లక్ష్యం -ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే… అదే మైనస్ -పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి… బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి, సంక్షేమం -ఢిల్లీలో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ‘వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు చూస్తే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని …
Read More »పట్టణాలలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ (DAY-NULM) మార్గదర్శకాల ప్రకారం మరియు మిషన్ డైరెక్టర్ యన్. తేజ్ భరత్ , I . A.S. ఆదేశాల మేరకు అన్ని పట్టణాలలో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ (C-LAP) రూపొందించి పట్టణంలోని పేద ప్రజలందరికీ వారి సామర్ధ్యం మరియు నైపుణ్యం ఆధారంగా జీవనోపాధిని కల్పించి తద్వారా అన్ని కుటుంబాల తలసరి ఆదాయం పెంచుటకు మునిసిపాలిటిల సమన్వయముతో కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా …
Read More »ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’… రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. …
Read More »ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ
-లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష -పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని….ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ …
Read More »స్టాండింగ్ కమిటి ఎన్నికలు ప్రశాంతం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ప్రణాళికాబద్దంగా కృషి చేసిన ఎన్నికల అధికారి, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటి ఎన్నికల అనంతరం గెలుపొందిన అభ్యర్ధులకు ధ్రవీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లడుతూ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నికలకు జనవరి 16న …
Read More »ఫిబ్రవరి 5 నుండి 20 వ తేది వరకు జరగనున్న జనరల్/ ఒ కేషనల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు
-జిల్లాలో జనరల్ విద్యారులకు 124, ఒకేషనల్ విద్యారులకు 23 పరీక్ష కేంద్రాలలో నిర్వహణ -ప్రాక్టికల్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 5 నుండి 20 వ తేది వరకు నిర్వహించనున్న జనరల్ / వోకేషనల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై …
Read More »ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా నేపథ్యంలో రేపు మంగళవారం నిర్వహణ
-తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా నేపథ్యంలో రేపు మంగళవారం నిర్వహణ : జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా పడిన నేపథ్యంలో రేపు మంగళవారం సదరు ఎన్నికల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం …
Read More »ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు 144 సెక్షన్ అమలు
-నేటి సోమవారం జరగాల్సిన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం వాయిదా నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు కొనసాగింపు, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు 144 సెక్షన్ అమలు : కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేక పోవడం వలన …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 220 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్ )కు వచ్చు అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపుతూ రీఓపెన్ లేకుండా చూడాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువు లోపు నాణ్యతతో పరిష్కారం చూపుతూ , రీఓపెన్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. …
Read More »
Prajavartha Online Telugu News