Breaking News

Daily Archives: February 26, 2025

ప్రత్యామ్నాయ పత్రాలలో దేనినైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన క్రింది ప్రత్యామ్నాయ పత్రాలలో దేనినైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చుని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. i. ఆధార్ కార్డ్, ii. డ్రైవింగ్ లైసెన్స్, iii.పాన్ కార్డ్, iv. భారతీయ పాస్ పోర్టు V. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు లేదా ఇతర ప్రైవేట్ …

Read More »

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ శెలవు మంజూరు చేయాలి

-శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగస్తులకు పోలింగ్ రోజు 27-02-2025 విధులకు హాజరు లో యాజమాన్యాలు తప్పనిసరిగా వెసులుబాటు కల్పించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గము శాసనమండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ 27.02.2025 (గురువారం) ఉదయం గం.8.00 ని.ల నుండి సాయంత్రం గం.4.00 ని.ల వరకు జరుగుతున్నందున శాసనమండలి ఎన్నికల్లో …

Read More »

మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరమశివునికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత సాయిబాబా దర్శనం చేసుకున్నారు. …

Read More »

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ తరలింపు

-గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం స్ధానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగు మెటీరియల్ తరలింపు ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని 92 పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్, సిబ్బంది 15 రూట్ లలో పంపించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ , …

Read More »

శ్రీ దుర్గామల్లేశ్వరులకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరులకు మంగళగిరి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు బుధవారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరులుగా ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఎంఎల్సీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్రమ మద్యం రాకెట్ భగ్నం

-పశ్చిమ గోదావరి జిల్లా అబ్కారీ, మద్యపానం నియంత్రణ అధికారి డా. కుమరేశన్ -కోళ్ల ఫారంలో దాచిన 4,500 బాటిళ్ల నకిలీ మద్యం స్వాధీనం భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై అక్రమ మద్యం రవాణాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన దాడుల్లో భారీ పరిమాణంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఓ వ్యక్తిని రాయల్ గ్రాండ్ మాల్ట్ విస్కీ (180ml) రెండు బాటిళ్లతో అరెస్టు చేయగా, …

Read More »

శాసనమండలి పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

-ప‌ట్ట‌భ‌ద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్ర‌త్యేక అవ‌కాశం: క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హ‌క్కు కలిగిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన‌ట్లు జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రాథమిక హక్కు అయిన వారి …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్ కు స‌ర్వం సిద్ధం…

-31 లొకేషన్ లో 77 పోలింగ్ కేంద్రాలు….. -పోలింగ్ విధుల్లో 477 మంది అధికారులు….. -మూడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ….. -ఓటు హక్కు వినియోగించుకోనున్న 63,114 మంది పట్టభద్రులు….. -పోలింగ్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4:00 వరకు…. -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజక వర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ కు ఏర్పాట్లు పూరి చేసి సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

తూర్పు తెదేపా కార్యాలయంలో గద్దె క్రాంతి జన్మదిన వేడుకలు

-తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ కేకు కటింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు టిడిపి నాయకులు గద్దె క్రాంతికుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత నాయకులు షేక్ నాగూర్ తెచ్చిన 37 కేజీల భారీ కేకును తెలుగు యువత శ్రేణులతో కలిసి గద్దె క్రాంతి కేక్ కటింగ్ చేసి యువతకు తినిపించారు. అనంతరం పెద్ద క్రాంతికుమార్ కు గజమాలను తెలుగుయువత శ్రేణులు వేశారు. …

Read More »

శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అశేష భక్త జనవాహిని

-ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా నలుమూలల నుండి పెద్దఎత్తున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6 వ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా బుధవారం జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు …

Read More »