విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు సూపరింటెండెంట్ లక్ష్మణరావు, ఏఈఓ చంద్రశేఖర్ సుజనా కు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం పొందారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని , అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. సుజనా వెంట బీజేపీ నాయకులు మిట్టా వంశీ, అడ్డూరి శ్రీరామ్ , కొత్తపల్లి సుబ్బారాయుడు, చైతన్య శర్మ, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, …
Read More »Monthly Archives: March 2025
ఐదేళ్లలో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ‘జీరో పావర్టీ -P4’ కార్యక్రమం ప్రారంభం
– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభం – “సమాజానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది” – సంపన్నులు-పేదల మధ్య వారధి, రాష్ట్రంలో 20 లక్షల బంగారు కుటుంబాలకు కొత్త ఆశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే దార్శనికతతో స్వర్ణ ఆంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది. ఇది పదిసూత్రాలు లేదా 10 మార్గదర్శక సూత్రాల ద్వారా సాధించబడుతుంది, వాటిలో ముఖ్యమైనది రాబోయే 5 సంవత్సరాలలో జీరో పావర్టీని …
Read More »ఈనెల 31 (సోమవారం) నాటి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టం (పిజిఆర్ఎస్) రద్దు…
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈనెల 31 రేపు ( సోమవారం) ప్రభుత్వ సెలవు అయినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టరేట్ తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినందున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు.
Read More »త్యాగానికి, మానవతా విలువలకు ప్రతీక రంజాన్…
-జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో ముస్లింలందరూ జరుపుకునే రంజాన్ పర్వదినం ముస్లిం సోదర, సోదరీమణులలో అత్యున్నత మానవతా విలువలు, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం ముస్లింలందరూ జరుపుకునే రంజాన్ పర్వదిన సందర్భంగా ఆయన ఒక పెటంలో శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణం సూచించే ఈ పర్వదినం ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిందని గుర్తు …
Read More »రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శభాకాంక్షలు
-క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయిక రంజాన్. -అల్లాహ్ దీవెనలతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలి. -శుభాకాంక్షలు తెలిపిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సోదర సోదరీమణులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రంజాన్ క్రమశిక్షణ,ధాతృత్వం, ధార్మిక చింతనల కలయిక అని అన్నారు. మత సామరస్యానికి, పరస్పర సదవగాహనకు …
Read More »కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకట రంగసాయి కుమార్ శర్మ పంచాగ శ్రవణం చేశారు. రాశి ఫలాలు వివరించారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రతిఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలతో కొత్త వెలుగులు నిండాలంటూ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వేడుకల్లో పాల్గొన్న డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సారథ్యంలో …
Read More »అంగరంగ వైభవంగా, ఘనంగా రాష్ట్ర స్థాయి ఉగాది సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు హజరయ్యారు. ముందుగా విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యోతిని వెలిగించి సీఎం చంద్రబాబు ఉగాది సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా షడ్రుచుల సమ్మెళనమైన ఉగాది పచ్చడిని నిర్వాహకులు అతిధులకు అందచేశారు. అనంతరం పండితులు, శతావధాని మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం …
Read More »మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు ఆదివారం ఉదయం నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నూతన నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, …
Read More »రంజాన్ సందర్భంగా డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు.. : కమిషనర్ పులి శ్రీనివాసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31వ తేది (సోమవారం) రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సోమవారం గుంటూరు నగరపాలక సంస్థలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దు చేయడమైనదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు స్థానిక సమస్యలపై నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 08632345103కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Read More »వడ్డీ రాయితీతో ఆస్తి పన్ను చెల్లించడానికి నేడే (సోమవారమే) ఆఖరి రోజు… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను చెల్లించటానికి సోమవారం ఒక్కరోజే గడువు ఉన్నందున ఈ నెల 31వ తేదీ రంజాన్ పండుగ సెలవు రోజైనప్పటికీ పన్నుచెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని పన్నుచెల్లించడానికి …
Read More »
Prajavartha Online Telugu News