-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ 30వ వార్షికోత్సవ మహాసభ అనంతపురంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 30 వేల మంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎంపీల సేవలు ప్రజలకు …
Read More »Monthly Archives: March 2025
ఎక్కువ మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారి పై చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఎక్కువ మొత్తంలో ఉన్న పన్ను బకాయిల అసెస్మెంట్ లపై చర్యలు తీసుకున్నారు విఎంసి రెవెన్యూ సిబ్బంది. అందులో భాగంగా సత్యనారాయణపురం, గవర్నర్పేట, సీతన్నపేట ప్రాంతాలలో గల ఎక్కువ కాలంగా భారీ మొత్తంలో బకాయిలు ఉన్న షాపులకు తాళం వేశారు రెవెన్యూ సిబ్బంది. పన్ను బకాయలు మొత్తం తిరిగి చెల్లించిన తర్వాతే వారి సేవలను వారు కొనసాగించవచ్చని వారికి తెలియజేశారు. నగరంలోని ప్రజలందరూ మార్చ్ …
Read More »రెస్టారెంట్లలో అగ్నిమాపక నిరోధ పరికరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం బెంజ్ సర్కిల్ దగ్గర platform-65 (Train restaurant) లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన కారణంగా సోమవారం RR దర్బార్, రాజాదర్బార్,సదరన్ స్పైస్ మరియు కడియపట్టణం రెస్టారెంట్స్ మరియు హోటల్స్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను …
Read More »ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి …
Read More »ఉగాది రోజున లబ్ధిదారుల చేతికి తాళాలు… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పరిధిలోని 432 మంది టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఉగాది రోజున వారి చేతికి తాళాలు అందిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగర పరిధిలోని గోసంఘంలోని టిడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. గోసంఘం టిడ్కో గృహ సముదాయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ …
Read More »అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కేఆర్ఆర్సి ఎస్డిసి శ్రీదేవిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక– మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల …
Read More »ఈనెల 28న అవనిగడ్డ లో జాబ్ మేళా…
-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.03.2025 శుక్రవారం అవనిగడ్డ లోని “ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ మనీ లిమిటెడ్, కెఎల్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ …
Read More »అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి…
-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమలోని కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పలుచోట్ల ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని ఆంచనా వేసి నష్టపరిహారం రైతాంగానికి సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సుమారు 10 మండలాల్లో 50 గ్రామాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలవల్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాధమిక …
Read More »చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి దృష్ట్యా కోనేరు సెంటర్లో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల దప్పిక తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా …
Read More »క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (World T.B day) సందర్భంగా సోమవారం కొత్త గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ర్యాలీ మరియు ప్రజలకు క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమం చేపట్టారు. Professor Dr Sudheena మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, కళ్ళె పడటం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రతి ఒక్కరు తెమడ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. …
Read More »
Prajavartha Online Telugu News