Breaking News

Monthly Archives: March 2025

రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించేది లేదన్నారు. అలా వ్యవహరించే వారిని సంఘం పదవుల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాతృ సంఘాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని వివరించారు. అటువంటి …

Read More »

నగరంలో ఘనంగా ‘వారథి’ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘వారథి’ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాయి భాషలను నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోకూడదని చెప్పారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరే ఇతర భాషల్లో ఉండదని, అందుకే దాన్ని ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అంటారన్నారు. మాతృభాషను ప్రేమించకుంటే తల్లిపై ప్రేమలేని వాడితో సమానమని …

Read More »

విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పైపులు రోడ్డు రవీంద్ర ధియేటర్ ఎదురుగా విజయకృష్ణ మల్టీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు పాల్గొని హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చనికుల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ యశోద హాస్పిటల్ లో అత్యవసర విభాగం సేవలు అందించాలని తెలిపారు అనుభవంతోనే విజయ్ కృష్ణ మల్టీస్పెషల్టే హాస్పిటల్ ని విజయవాడ నగర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేనని తెలిపారు. …

Read More »

ఆత్మవిశ్వాసంతో హాజరుకండి

-టెన్త్ విద్యార్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ( మార్చి 17)నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలకు హాజరుకాబోతున్న బీసీ హాస్టళ్ల విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇతర …

Read More »

అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి ఆమె పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, …

Read More »

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు త్యాగం మ‌రువ‌లేనిది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని సత్యనారాయణపురంలోని ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు …

Read More »

సోషల్ మీడియా మీట్ లో వన్ ఎలక్షన్ వన్ నేషన్ అంశం పై సెమినార్

-బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ముఖ్య ప్రసంగం -స్టాలిన్ పై పూనావాలా విసుర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమిలి ఎన్నికలు అన్ని విధాలుగా అందరికీ మేలన్న విషయం గ్రహించాలని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా హితవు పలికారు . సోషల్ మీడియా INFLUENCERS MEET లో ముఖ్య అతిథి గా పాల్గొని షెహజాద్ పూనావాలా ప్రసంగించారు. విజయవాడ నక్షత్ర హోటల్లో జరిగిన సమావేశంలో పూనావాలా మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి దేశానికి ఒకే ఎన్నిక ఎంతో ఉపయోగకరంగా …

Read More »

పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

– ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించండి – పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేపు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలి. విధ్యాభ్యాసంలో పదో తరగతి పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఉన్నత విద్యాభ్యాసానికి కీలకంగా నిలిచే మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Read More »

ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో మిల్క్ బ్యాంకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ విచ్చేసిన ప్ర‌ముఖ సినీ న‌టుడు మహేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త ప్ర‌కాశం రోడ్డులోని ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మిల్క్ బ్యాంకును ముఖ్య అతిథిగా హాజ‌రైన న‌మ్ర‌త ప్రారంభించారు. అనంత‌రం మీడియా స‌మావేశంలో న‌మ్ర‌త మాట్లాడుతూ, ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ రూ.ముప్పై ఏడులక్షల వ్యయంతో అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చనుపాలు సేకరించి, అందించాల‌న్న‌ది ప్రాజెక్టు ముఖ్య …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర్ పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 …

Read More »