Breaking News

Monthly Archives: March 2025

ఇంద్రకీలాద్రి పై శాశ్వతంగా నిలిచే అభివృద్ధి పనులు

-సమీక్షలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆలయ అధికారులతో చర్చించి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.. సమీక్షలో ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అధికారులు.. మరియు టెక్నికల్ …

Read More »

విశ్వ ఆయుర్వేద పరిషత్ లో స్త్రీ లకు సముచిత స్థానం కల్పించడం జరిగింది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గాంధీ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ మాధవరావు చౌదరి, ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగినది. మొదట జనరల్ సెక్రెటరీ డాక్టర్ సాహితీ భగవాన్ ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేయగా మరియు డాక్టర్ పద్మజ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ మాధవరావు మాట్లాడుతూ స్త్రీ లేనిదే విశ్వం లేదని, స్త్రీలను గౌరవించడం భారతదేశంలో యుగాల …

Read More »

మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అదానీ కోసమే అన్నట్లు ఉంది… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ వైద్యం ప్రభుత్వం నిర్వహించలేదు ప్రవేట్ పరం చేస్తాము అన్న విధంగా మాట్లాడడం లో ఉద్దేశం వైద్య రంగంలో పెట్టుబడి పెట్టబోతున్న గౌతమ్ అదానీ కోసమే అని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు విజయవాడలో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది, గౌతమ్ అదానీ కోసమే మన రాష్ట్ర పార్టీలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నదానికి ఉదాహరణ గౌతమ్ అదానీ …

Read More »

కుటుంబ సాధికార సారధుల నియామయకంపై సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ సాధికార సారదుల నియామకంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. అందువల్ల ప్రతి నాయకుడు ఈ కుటుంబ సాధికార సారధుల నియామకాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. పటమట అశోక్‌ నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో కుటుంబ సాధికార సారదుల నియామకాల పై ఆదివారం ఉదయం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ కుటుంబ సాధికార సారధులు చాలా …

Read More »

జాతీయ విద్యావిధానం 2020 పై రెండురోజుల జాతీయ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, సంస్కృత సంస్కృతి వికాస సంస్థాన్ న్యాస్, మధుర సంయుక్త తత్త్వావధానంలో జాతీయ నూతన విద్యావిధానం 2020 మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలపై ఏకీకరణ మరియు పునరుజ్జీవనం అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవం ఈ రోజు విశ్వవిద్యాలయంలోని ప్రముఖ చెలికాని అన్నారావు సభాభవనం నందు జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా శ్రీలాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొ.మురళీ మనోహర్ పాఠక్ …

Read More »

ఈ నెల 10వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, …

Read More »

పీ4 కార్యాచ‌ర‌ణ‌లో భాగ‌స్వాములుకండి…

– ఆలోచ‌న‌లు పంచుకోండి.. మార్పున‌కు నాంది ప‌ల‌కండి.. – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆవిష్క‌రించిన స్వ‌ర్ణాంధ్ర @ 2047లో భాగంగా పేద‌రికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావ‌ర్టీ-పీ4 విధానం అమ‌లుకు క‌స‌రత్తు జ‌రుగుతోంద‌ని.. ఈ ప్ర‌యాణంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. స్వ‌ర్ణాంధ్ర‌@2047 విజ‌న్ డాక్యుమెంట్‌లోని ప‌ది సూత్రాల్లో మొద‌టి సూత్ర‌మైన శూన్య పేద‌రికం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం …

Read More »

కేంద్రం ఇస్తున్న పథకాలు వినియోగించుకొని స్వావలంబన సాధించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి మహిళా మోర్చాఎన్టీఆర్ జిల్లా మరియు జోనల్ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆహ్వానం కళ్యాణమండపం భవానిపురం విజయవాడ నందు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి బొల్లినేనిచంద్రిక అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, కేంద్రం ఇస్తున్న పథకాలు వినియోగించుకొని స్వావలంబన సాధించాలని తెలియచేశారు. సాదినేని యామిని శర్మ బి.జె.పి ఏపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఆడవాళ్లు శక్తి స్వరూపిణలు, ఆ శక్తిని సరైన మార్గంలో …

Read More »

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ..!

-స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో ది చేంజ్ మేకర్, హాసి ఫౌండేషన్ సహకారంతో వన్ టౌన్ లోని సి.వి.రెడ్డి ఫౌండేషన్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరై సేవలు పొందారు. పదిమంది సాంకేతిక నిపుణులతో ఈ శిబిరాన్ని కొనసాగించారు. దివ్యాంగుల కొలతలు తీసుకొని గంటల వ్యవధిలోనె వారికి …

Read More »

జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి

-ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని జర్నలిస్టుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని శాసనమండలికి నూతనంగా ఎన్నికైన మాజీ మంత్రి, న్యాయవాది ఆలపాటి రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. 1985 నుండి ఆలపాటితో సాన్నిహిత్యం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు వారి స్వగృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ.. గడిచిన నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థి దశ నుంచి జర్నలిస్టులతో సాన్నిహిత్యం కలిగిన ఆలపాటికి తమ కష్టసుఖాలు, ఇతర …

Read More »