విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం బలోపేతానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేంద్రాన్ని కోరారు. విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యస్సో నాయక్ కు మెమోరాండాన్ని అందజేశారు. ఏపీ పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సహిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాల కోసం గ్రీన్ ఎనర్జీ కారిడార్ …
Read More »Monthly Archives: April 2025
అపార్ట్ మెంట్లు, మాల్స్ ను తరుచూ తనిఖీ చేయాలి
-ఎన్ ఓ సి కి విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే చర్యలు తప్పవు -గ్రామాల్లో, పట్టణాల్లో అగ్నిప్రమాద నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి -కమిటీల వారితో కనీసం మూడు నెలలకు ఒక సారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. -వంగలపూడి అనిత, రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖమాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖమాత్యులు వంగలపూడి అనిత చెప్పారు. …
Read More »యం యస్ యం ఈల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి
-ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నైలోని తమిళనాడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్‌నుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు.సూక్ష్మ, చిన్న సంస్థలకు వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో ఇన్‌స్టిట్యూట్ అవలంబించిన ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా రంగానికి సంబంధించిన ఇంక్యుబేషన్ కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇన్నోవేషన్ వోచర్ ప్రోగ్రామ్ తీసుకున్న చొరవలను తెలుసుకోవడానికి తమిళనాడు డైరెక్టర్ ఇ డి ఐ …
Read More »ప్రధాని నరేంద్ర మోడి శంఖుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపం అమరావతి పరిధిలో వివిధ శంఖుస్థాపన కార్యక్రమాల్లో మే 2 వ తేదిన పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , సీఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఎం నవీన్ కుమార్ తో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్డు షో చేసే మార్గాలు , ప్రధాన …
Read More »“మన శక్తి, మన గ్రహం”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని 22nd April, 2025 పురస్కరించుకుని భారతీయ విద్యా భవన్ పాఠశాలలో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. “మన శక్తి, మన గ్రహం” అనే థీమ్‌తో, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుంటూరు రీజినల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నజీనా బేగం మరియు ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి ఈ ఉత్సవాలు జరుపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుంటూరు రీజినల్ పర్యావరణఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ పరిశ్రమలు, బహుళ అంతస్తుల నిర్మాణదారులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు …
Read More »భూమి పరిరక్షణ మన అందరి బాధ్యత.
-వై డి రామారావు, చైర్మన్, ఏపీ రెడ్ క్రాస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య సంరక్షణ, భూమి పరిరక్షణ కై బాధ్యత తీసుకోవలసిన తరుణం ఆసన్నమైనదని రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ వైడి రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని భారతీయ విద్యాభవనసు నందు నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మనిషి సౌకర్యవంతమైన …
Read More »భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల పై సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాస్కర్ నగర్ సొసైటీ భూ లావాదేవీల కార్యకలాపాలు, వాటికి సంబంధించిన రికార్డుల్ని సమగ్రంగా పరిశీలన చేస్తేనే ఆ స్థలం ఎవరిది అన్న విషయం నిర్ధారణ చెయ్యడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల పై మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, హై లెవెల్ కమిటీ సభ్యులు ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ, జిల్లా కో …
Read More »బోట్స్ అనుమతుల విషయములో కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది లో నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు బోట్స్ కు అనుమతులు జారీ చేయడం జరుగుతోందని, అయితే వాటి కోసం మాత్రమే ఉపయోగించేలా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారుd మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బోట్స్ అనుమతుల విషయములో సమన్వయ శాఖల అధికారులతో ఎస్పీ డి నరసింహా కిషోర్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక …
Read More »విపత్తు నివారణ కోసం ములకల లంక గ్రామం మాక్ డ్రిల్ విశేష స్పందన
-ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, స్పెషల్ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు ప్రకృతి వైపరిత్యములకు సంబందించి ప్రజలకు అవగాహన కలిపించుట జరిగిందని7 ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, మండల ప్రత్యేక అధికారి, కె ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు విషయంలో ముందస్తుగా రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్, పంచాయతీ, మహిళా …
Read More »ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వెయ్యాలి
-కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు తరాలకు ఆరోగ్య వంతమైన ఆహారాన్ని అందిచాలనే లక్ష్యం కోసం ప్రతి రైతు తప్పనిసరిగా వారు సాగు విస్తీర్ణం లో దశల వారీగా ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం కడియం మండలం మాధవ రాయుడు పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కేంద్ర …
Read More »
Prajavartha Online Telugu News