– 175 నియోజక వర్గాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ – తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిష్కరించనున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ …
Read More »Monthly Archives: August 2026
రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి
-సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్ -రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు -రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు -5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి -జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం -ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు… 28 వేల మంది రైతులకు లబ్ధి -నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి -50 వేలకు పైగా ఎకరాల్లో …
Read More »ప్రశాంతంగా నీట్ పీజీ ఎగ్జామ్ … 97.40% హాజరు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో భాగంగా రాష్ట్రoలో ఆదివారం నిర్వహించిన NEET-PG 2026 ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 77 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 19,266 మంది అభ్యర్థులకుగాను 18,765 మంది అభ్యర్థులు పరీక్ష(97.40%)కు హాజరయ్యారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. సాయి సుధీర్, పోలీస్ శాఖ తరఫున శ్రీ ఫక్కీరప్ప, IPS రాష్ట్ర నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ పరీక్షా నిర్వహణ …
Read More »ఆనితర సాధ్యులు సీఎం శ్రీ చంద్రబాబు
-30 ఏళ్ల వెలిగొండ కల సాకారం -కృష్ణమ్మను కరవు నేలకు తీసుకురావటం ఆయన సంకల్పానికి నిదర్శనం -సీఎంకు సత్యకుమార్ అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం కానుండటం ప్రకాశం, మార్కాపురం ప్రాంత ప్రజలకు చారిత్రాత్మక సందర్భమని బీజేపీ జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇప్పుడు తొలి దశను ప్రారంభిస్తుండటం ఆయన సంకల్పబలానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన …
Read More »కొండలు.. కోనల్లో ఉండే గిరిజనులకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు
-4 డ్రోన్లు.. 1,800కుపైగా ట్రిప్పులు -71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణం -నమూనాల సేకరణ, మందులు వ్యాక్సిన్ల సరఫరా ద్వారా 24,500 మందికిపైగా రోగులకు సేవలు.. -సమయం, దూరం, ఖర్చుల ఆదా -గిరిజనులకు సత్వర వైద్యం -రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టిన డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థతో సత్ఫలితాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ సత్ఫలితాలు అందిస్తోంది. కొండలు, దట్టమైన …
Read More »విజయవంతంగా ముగిసిన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
-ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా పరీక్షల నిర్వహణ -అభ్యర్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన యంత్రాంగం -అధికారుల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు -పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుంచి 30వ …
Read More »నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి పెళ్లి కానుక..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గ పరిధిలో వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు ప్రత్యేకంగా ‘సుజనా పెళ్లి కానుక’ అందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు పంపిన కుటుంబాలకు చీర, వరుడికి ప్యాంటు-షర్ట్, స్వీట్ బాక్స్‌తో పాటు పసుపు, కుంకుమలను కానుకగా అందజేస్తున్నారు. 41వ డివిజన్, మసీద్ స్ట్రీట్ కు చెందిన చెందిన అబ్దుల్ గఫార్ (లేటు ), గౌసియా దంపతుల కుమార్తె అబ్దుల్ కౌసర్ వివాహం షేక్ అబుబకర్ …
Read More »వైభవంగా శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవాసమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు ఆదివారం, అత్యంత వైభవంగా జరిగాయి. గురు సార్వభౌముల ఆరాధన వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3000 వేల మంది భక్తులకు అన్న సమారాధన చేశారు. ఈ మహోత్సవము లలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి …
Read More »తిరుపతి రూరల్ చైతన్యపురంలో ఓటర్ల జాబితా సవరణ శిబిరాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతి రూరల్ పరిధి చైతన్యపురంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలు, అభ్యంతరాల స్వీకరణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుతున్న దరఖాస్తులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు సూచనలు …
Read More »ఈ నెల 31 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన …
Read More »
Prajavartha Online Telugu News