Breaking News

కడప జిల్లా తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అస్వస్థత ఘటనలో విద్యార్థులంతా క్షేమం

-ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
-AP SWREIS కార్యదర్శి బి. లావణ్య వేణి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లా తొండూరులోని డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థత చెందిన ఘటనపై AP SWREIS కార్యదర్శి బి. లావణ్య వేణి స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గురుకులంలో పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించామని తెలిపారు. విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించి DMHO ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. కడప జిల్లా AP SWREIS DCO ఆసుపత్రిలోనే ఉండి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకుల పాఠశాలల సిబ్బంది ఎవరైనా సరే విద్యార్థుల పట్ల అలసత్వం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని లావణ్య వేణి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..

-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ -ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు -మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *