Breaking News

జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..

-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ
-ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు
-మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతతో రికార్డు
-డైరెక్టర్ విశ్వనాథన్ దిశానిర్దేశంలో అరుదైన మైలురాయి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలనా పారదర్శకత, జవాబుదారీతనం, డిజిటల్ సేవలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించి ప్రతిష్ఠాత్మక స్కోచ్ సిల్వర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

శనివారం న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో ఘనంగా జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్ వేదికగా సమాచార పౌర సంబంధాల శాఖ ఈ గవర్నెన్స్ విభాగంలో మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినందుకు మీడియా అక్రిడిటేషన్ మేనేజ్మెంట్ సిస్టం అంశం గాను సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సమాచార శాఖ డైరెక్టర్ తరపున జాయింట్ డైరెక్టర్ ఐ.సూర్యచంద్రరావు, ఆర్.ఐ.ఈ డా.నాగరాజ అందుకున్నారు. స్కోచ్ అధికారిక రికార్డుల్లోనూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ చేపట్టిన ఈ డిజిటల్ అక్రిడిటేషన్ విధానం పారదర్శకతకు ప్రతీకగా నమోదైంది.

అక్రిడిటేషన్ విప్లవాత్మక మార్పులతో దేశవ్యాప్తంగా ప్రశంసలు

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ విశ్వనాథన్ అందిస్తున్న సమర్థవంతమైన మార్గదర్శకత్వం అక్రిడిటేషన్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీలో ఎలాంటి సిఫార్సులు లేకుండా, పూర్తిగా నిబంధనలకు కట్టుబడి వ్యవహరించడం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ జాతీయ పురస్కారం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, టెక్నాలజీని జోడించి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించడం, అర్హులైన జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్లు అందజేయడం వంటి చర్యల ద్వారా ఎలాంటి జాప్యానికి తావులేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ అమరావతి ‘క్వాంటం వ్యాలీ’ అంశంలో (అమరావతి) గోల్డ్ స్కోచ్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును డిజిటల్ కార్పొరేషన్ ఈడి రాణి సుస్మిత, స్పెషల్ ఆఫీసర్ శేషు కుమార్ అందుకున్నారు.

“టీమ్ ఐ & పీఆర్ అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపు”

ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. మీడియా రంగానికి మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు శాఖ చేస్తున్న కృషికి ఈ స్కోచ్ అవార్డులు లభించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ జాతీయ పురస్కారాలు కేవలం శాఖకు మాత్రమే దక్కిన విజయం కాదని, అక్రిడిటేషన్ మరియు డిజిటల్ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అహర్నిశలు శ్రమించిన ‘టీమ్ ఐ & పీఆర్’ ప్రతి ఒక్కరి అంకితభావానికి, సమిష్టి కృషికే దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు.అలాగే, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు ‘గోల్డ్ స్కోచ్ అవార్డు’ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పారదర్శక పాలనను మరింత బలోపేతం చేసేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ, డిజిటల్ రంగంలోనూ రాణిస్తూ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇనుమడింపజేస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కడప జిల్లా తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అస్వస్థత ఘటనలో విద్యార్థులంతా క్షేమం

-ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం -AP SWREIS కార్యదర్శి బి. లావణ్య వేణి అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *