పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక అయింది. ఈ మేరకు నీతి ఆయోగ్ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ గీతాంజలి గుప్తా, సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్ కె దమిజ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక అయినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా …
Read More »Daily Archives: February 13, 2025
బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన పనిలేదు
-నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టాం -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సమస్య …
Read More »విజయవాడలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన సేకరణతో ఎగ్జిబిషన్ నిర్వహించనున్న వుమ్మిడి బంగారు జువెల్లర్స్
-రెండు రోజుల ఈవెంట్‌లో అద్భుతమైన బంగారం మరియు వజ్రాల ఆభరణాల సేకరణలను చూడండి, కొనుగోలు చేయండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వుమ్మిడి బంగారు జ్యువెల్లర్స్ (VBJ), భారతదేశపు అత్యంత విశ్వసనీయ వారసత్వ ఆభరణాల బ్రాండ్, ఫిబ్రవరి 15 మరియు 16, 2025న విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్లో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో సున్నితంగా రూపొందించిన బంగారం మరియు వజ్రాల ఆభరణాల అద్భుతమైన శ్రేణిని ప్రదర్శిస్తారు, సందర్శకులకు కాలాతీత వస్తువులను అన్వేషించడానికి మరియు కొనుగోలు చేయడానికి చక్కని …
Read More »బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా బందెల గౌతమ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా బందెల గౌతమ్ కుమార్ నియమింపబడ్డారు. ఈ నెల 10న పార్టీ అధినేత్రి, జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి, గౌతమ్ కుమార్ ని అధ్యక్షులుగా, బీ పరంజ్యోతిని రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఈ నెల 15న, అనగా శనివారం రాష్ట్రంలోని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మరియు అసెంబ్లీ అధ్యక్షులు ఇంచార్జులు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఉదయం 10 గంటలకు రావలసినదిగా తెలియజేస్తున్నట్టు పార్టీ ఏపీ …
Read More »2024-25 ఏడాదికి గాను వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు కొత్త ప్రతిపాదనలు అందలేదు
-కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ వెల్లడి -ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏడు వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు అనుమతి లభించింది. ఎపిలో 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఏ క్లస్టర్‌కూ అనుమతి ఇవ్వలేదు. కానీ, 2022-23లో అనంతపురం జిల్లాలో చరణ్ …
Read More »మూడు నెలల్లో ఆటోనగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ : ఎంపి కేశినేని శివనాథ్
-ఆటో మొబైల్ అసోసియేషన్స్ తో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ లో ఆటో మొబైల్ రంగం పై ఆధారపడి జీవిస్తున్న లక్షమంది కార్మికులకి మారిన టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకునేందుకు కావాల్సిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఆటోనగర్ లోనే మూడు నెలల్లోనే ఏర్పాటు చేయిస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆటోనగర్ లో వున్న 32 ఆటో మొబైల్ అసోసియేషన్స్ నాయకులతో ఎంపి కేశినేని …
Read More »ఆటోనగర్ కి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కలిసి కృషి చేద్దాం : ఎంపి కేశినేని శివనాథ్
-ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోనగర్ లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యులతో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గురువారం సమావేశం అయ్యారు. ఆటోనగర్ లోని ఆటో మొబైల్ రంగంలో ఉపాది పొందుతున్న లక్షమంది వర్కర్స్ మారిన టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య పరంగా అప్ గ్రేడ్ చేయాలంటే ఏలాంటి …
Read More »భావితరాల భవిష్యత్తును కాపాడాలి… : గ్యారీ రైడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్, యస్ పి వై ఎమ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో యువత లో మాదకద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు మూడు రోజులుగా కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో జరుగుతున్న “నవచేతన ” అవగాహన సదస్సు గురువారం ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కే బీ ఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రావు చేతుల మీదుగా అవగాహన సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయులకు, …
Read More »బంధం, బంధుత్వాల గురించి నేటి తరానికి తెలియజేయాలి
–14వ డివిజన్‌లో శ్రీలలితా పరమేశ్వరి అమ్మ వార్ల ఏసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు, ఉమ్మడి కుటుంబంగా ఉండటం వల్ల కలిగే సంతోషాల గురించి నేటి తరానికి మనమందరం తెలియజేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ పటమట దర్శిపేటలోని శ్రీలలితా పరమేశ్వరి అమ్మ వార్ల ఏసి కల్యాణ మండపం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ …
Read More »వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమమే
–ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంశీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు –వంశీ ఆ ప్రాధాన్యతను మరచి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపైనే అసభ్యంగా మాట్లాడారు –వంశీ అరెస్ట్‌పై స్పందించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ సక్రమమేనని, వల్లభనేని వంశీ ఒక నేరాన్ని చేసి దాని కప్పిపుచ్చడానికి మరికొన్ని నేరాలకు పాల్పడ్డాడని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల గురువారం మధ్యాహ్నాం విలేకరుల …
Read More »
Prajavartha Online Telugu News