గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో అభివృద్ధి పనులను స్థానిక ప్రజల అవసరాల రీత్యా ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, చేపట్టిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఆదర్శ నగర్, ఏటి అగ్రహారం, పెద్ద పలకలూరు, స్వర్ణాంధ్ర నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత …
Read More »Daily Archives: February 13, 2025
ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రచార కార్యక్రమాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రచార కార్యక్రమాలు, ఇతర పోలింగ్ ప్రక్రియలు నిర్వహించుకోవాలని ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం …
Read More »గ్రామాలలో రీసర్వే
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో ఈరోజు జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం ఈ రోజు ఆకస్మికముగా కాకుమాను మండలమునందు పాండ్రపాడు మరియు చేబ్రోలు మండలము నందు మంచాల గ్రామాలనందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు. తదుపరి రీ సర్వే కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రీ సర్వే జరుగు విధానం మరియు …
Read More »జిల్లాలో స్వీప్ అవగాహన కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, గుంటూరు జిల్లా వారి ఆదేశాలు మేరకు, ఈరోజు గుంటూరు నందు గల స్థానిక హిందూ ఫార్మసీ కాలేజీ మరియు సిమ్స్ ఫార్మసీ కాలేజీలలో స్వీప్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అదనపు మున్సిపల్ కమిషనర్ ఓబులైష్ మాటలాడుతూ ఓటు హక్కు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి పౌరుడు వారి యొక్క ఓటును వినియోగించమని మరియు మెరుగైన సమాజం కోసం సరియైన …
Read More »కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని అభ్యర్థించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతీ ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ, కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ కూడా ఈ …
Read More »ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఛాంపియన్ కర్ణాటక టీం
-ఆసక్తిగా సాగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్..అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన కర్ణాటక జట్టు -హోరాహోరీగా సాగిన తుదిపోరులో కేరళ జట్టుపై ఘన విజయం సాధించిన కర్ణాటక టీం -99 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న కర్ణాటక బ్యాట్స్ మెన్ అర్జున్ హొయసాల..టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి రికార్డు సృష్టించిన అర్జున్ -టోర్నమెంట్ లో 9 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ గా నిలిచిన కేరళకు చెందిన అంకిత్ మిశ్రా, బెస్ట్ బ్యాట్స్ …
Read More »ఎన్నికల కోడ్ అమల్లో అప్రమత్తంగా ఉండాలి..
– ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనియాలి – నిష్పక్షపాతం, నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్తర్తించాలి – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరుగుతుందని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా అమలుచేయడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య హాల్‌లో ఎంసీసీతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్స్ …
Read More »రవాణావాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు నిబంధనలు తప్పక పాటించాలి
-మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : సరుకు రవాణా చేసే వాహన డ్రైవర్లు భద్రత నియమాలు తప్పక పాటించాలని, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీయొద్దని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యం వి నారాయణ రాజు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా కెసిపి సిమెంట్ ప్రాంగణంలో గురువారం నాడు కెసిపి సిమెంట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మరియు ఉద్యోగులు తో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెసిపి ప్రాంగణంలో జరిగిన …
Read More »జిల్లా కమిటీ సభ్యులుగా నియమితులైన నాయకులకు మల్లాది విష్ణు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన యర్రగొర్ల శ్రీరాములు, ఓబిరెడ్డి వెంకటరామిరెడ్డి, గజ్జలకొండ వాసు, కంది వెంకట రమణారెడ్డి, వరికూటి నాగిరెడ్డి గురువారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సభ్యులకు మల్లాది విష్ణు తన అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుబడే ప్రతీ కార్యకర్తకు దశలవారీగా సముచిత స్థానం కల్పిస్తామని మల్లాది విష్ణు చెప్పారు. …
Read More »కాలువగట్ల సుందరీ కరణతో కాలుష్య నియంత్రణ
-కాలువ ఒడ్డున ప్రజలకు ఆహ్లాదకరమైన పార్క్ ఏరియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త కాలువగట్ల సుందరీకరణతో ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించటమే కాకుండా కాలువ ఒడ్డున ప్రజలకు ఆహ్లాదకరమైన పార్క్ ఏరియా కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ కెనాల్ బండ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరాన్ని అత్యంత సుందరంగా మార్చేందుకు, కాలుష్య నియంత్రణకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు బందర్ కాలువ, ఏలూరు కాలువ గట్ల సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసి …
Read More »
Prajavartha Online Telugu News