గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో రాష్ట్ర సచివాలయం సమీపంలో 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది కార్యక్రమంలో, ప్రజలు దాతలు ప్రభుత్వం భాగస్వామ్యం (పీ4) కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను శనివారం జిల్లా ప్రత్యేక అధికారి సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , ఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ , గుంటూరు ఆర్డీవో …
Read More »Monthly Archives: March 2025
మార్చి 29న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము మార్చి 29వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జ్యోతి బసు నేడొక ప్రకటనలో తెలియజేశారు. మార్చి 29వ తేదిన ఉదయం 10:30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన జరిగే జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన …
Read More »ఆస్తి పన్ను చెల్లించడానికి కేవలం 9 రోజులే గడువు… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2024–25 సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (9 రోజులే) గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా ఆదివారం, ఈ నెల 30,31 సెలవు రోజులైనప్పటికీ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి పన్నులు …
Read More »త్రాగు నీటి సరఫరాలో అంతరాయం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24 వ తారీఖు సోమవారం హెచ్.యల్.ఆర్ ప్రాంగణం నుండి ఏ.టి అగ్రహారం రిజర్వాయర్ నకు త్రాగు నీరు సరఫరా చేయు ప్రధాన పంపింగ్ మెయిన్ లైన్ పై స్లూయిజ్ వాల్వ్ మార్చుచున్నందున సదరు రిజర్వాయర్లకు మరియు గృహాలకు త్రాగు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని హెచ్.యల్.ఆర్ వాటర్ వర్క్స్ ప్రాంగణం నందు …
Read More »క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్నక్యాంటీన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది, జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలతో ఆహ్లాధకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ల వద్ద …
Read More »అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకొని, వ్యర్ధాలను ఆయా సేకరణ ఏజన్సీలు లేదా నగరపాలక సంస్థ ప్రజారోగ్య వాహనాలు అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ పట్టాభిపురం, స్తంభాల గరువు, శ్యామల నగర్, సాయి నగర్, బంజారా నాయక్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, వెంకటరామణ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు …
Read More »కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ఇంజినీరింగ్ విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.రోశయ్య కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా, మాట్టి ఖర్చుల చెక్ ను వారి కుటుంబ సభ్యులకు శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో …
Read More »హోం కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర-స్వచాంధ్ర నినాదం స్పూర్తితో అక్టోబర్ 2 నాటికి క్లీన్-గ్రీన్ గుంటూరు సాధనకు ప్రజల సహకారం మరియు భాగస్వామ్యంతో కృషి చేస్తామని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రూఫ్ గార్డెనింగ్ మరియు హోం కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల నేతృత్వంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్చత, …
Read More »కూలిన రిటైనింగ్ వాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం, 44 వ డివిజన్ సొరంగం కొండ ప్రాంతంలో శుక్రవారం మట్టి పెళ్ళలు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో స్థానిక ఇంటి పైకప్పు రేకులు కొంతమేర దెబ్బతిన్నాయి, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కొండ ప్రాంతంలో బేస్మెంట్ పిచ్చింగ్ జారిపోవడంతో ప్రమాదం జరిగింది. మట్టిపెళ్లలు జారి పడుతుండటంతో ఇళ్లలోని నివాసితులు అప్రమత్తమయ్యారు. క్రింది భాగాన ఉన్న రేకుల షెడ్డుపై మట్టి పెళ్లలు పడటంతో ఇంటి పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం …
Read More »ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి న్యాయమైన వాటాను ఇవ్వాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర విజయవాడ ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి రావలసిన న్యాయమైన వాటాను ఇవ్వాలని వాటా నిష్పత్తిని పెంచాలని రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెల్లి కార్పొరేషన్ ను త్వరితగతిన పునరుద్ధరించి రెల్లి సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం …
Read More »
Prajavartha Online Telugu News