Breaking News

Monthly Archives: June 2025

మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి

-బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదు -కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీపై చర్యలు చేపట్టాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం ముగిసిన వారాలు గడుస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. గోదావరి`బనకచర్ల ప్రాజెక్టు ఏర్పాటును …

Read More »

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లల్లో వేగం పెంచండి

-పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలి -రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలి -పంట వివరాలు, పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించండి -ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలి -ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయండి -మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని …

Read More »

పన్నుల వసూళ్లలో అవగాహన కల్పించండి.. వేధింపులు వద్దు

-వ్యవస్థలో లొసుగులు వాడుకుని రెవెన్యూకు గండి కొడితే కఠిన చర్యలు -రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి -ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించండి -ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. …

Read More »

ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు

-22వ తేదీలోపు ఆప్టిక‌ల్ గ్రౌండ్ వైర్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి -అధికారుల‌కు ఫైబ‌ర్‌నెట్ ఎండీ ప్ర‌వీణ్ ఆదిత్య ఆదేశాలు విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇక అంత‌రాయాలు లేని పైబ‌ర్‌నెట్ సేవ‌లు అందించ‌నున్నామ‌ని పైబ‌ర్‌నెట్ ఎండీ ప్ర‌వీణ్ ఆదిత్య తెలిపారు. పైబ‌ర్‌నెట్ సేవ‌లు మెరుగుప‌రిచి ప్ర‌జ‌ల‌కు అంత‌రాయం లేకుండా సేవ‌లందించ‌డానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి ఆయ‌న బుధ‌వారం విశాఖ‌ప‌ట్నంలో ఒక ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ఆయ‌న స్ప‌ష్ట‌మైన ఆదేశాలివ్వ‌డంతో పాటు దిశానిర్దేశం చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇక‌పై ప్ర‌జ‌ల‌కు …

Read More »

యోగాంధ్రతో పలుప్రపంచ రికార్డులు సాధించి ఎపిని దేశంలో మొదటి స్థానంలో నిలపాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఎపిని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.యోగాంధ్ర కార్యక్రమంపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని …

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీట

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, రైళ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అనుసంధానంతో పాటు వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి మొత్తంగా 20 కి తగ్గకుండా.. అదే సమయంలో ఖచ్చితంగా 14 ఎయిర్ పోర్టులు ఉండే విధంగా …

Read More »

డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. రేపటి నుంచి ఆయా పాఠశాలల్లో ఈ ధరఖాస్తులు స్వీకరిస్తారు. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ (25 జూన్ 2025 )పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎస్సి, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు 6 వ తరగతి …

Read More »

మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తి జస్టిస్ డా. వి.ఆర్.కె.కృపాసాగర్

-రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డా.వి.ఆర్.కె.కృపాసాగర్ పేరుతెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్చగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డా.వి.ఆర్.కె. కృపాసాగర్ పదవీ …

Read More »

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

-50% రాయితీతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాల పంపిణీ -ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు గంగాధర్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధిస్తున్నదని, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించి వ్యవసాయ రంగాన్ని సైతం అభివృద్ధికి తీసుకురావాలని గౌ. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జిడి నెల్లూరు శాసన సభ్యులు వి.ఎం థామస్ పేర్కొన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీ పై …

Read More »

ఎపిఇఆర్సి(APERC)లో సభ్యుని నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్(ఎపిఇఆర్సి)లో సభ్యుని నియామకానికి సంబంధించి అర్హులైన అభ్యుర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(FAC)కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన అభ్యర్ధులు వారి నామినేష్లను 9-7-2025లోగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్,ఇంధన శాఖ,గ్రౌండ్ ప్లోర్,బ్లాక్-2,ఎపి సెక్రటేరియట్,వెలగపూడి-522 238 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుందని ఆయన తెలియజేశారు.ఇ-మెయిల్ అడ్రస్.Tappal-ene01@ap.gov.in. అదే విధంగా ఎపిఇఆర్సి సభ్యుని నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ, అర్హతలు తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ …

Read More »