Breaking News

Monthly Archives: July 2026

ఎల్‌నినో స‌వాళ్ల‌కు శాస్త్రీయ వ్యూహం..

– సాగు విధానాలపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి – వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి – ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, అంత‌ర‌పంట‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్ర‌భావాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సాగు విధానాల‌పై అన్న‌దాత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఎల్‌నినో ప్ర‌భావాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అధిగ‌మించేందుకు అమ‌లు చేయాల్సిన కార్యాచ‌ర‌ణ‌, చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ …

Read More »

ఈ నెల 3న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆటోన‌గ‌ర్‌లోని కోగంటి రామ‌య్య తుల‌శ‌మ్మగార్ల ఏపీఐఐసీ కాల‌నీ వెల్ఫేర్ అసోసియేష‌న్ వారి క‌ళ్యాణ‌మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు …

Read More »

జిల్లాలో స‌జావుగా స‌ర్ ప్ర‌క్రియ‌..

– 97.38 శాతం ఎన్యూమ‌రేష‌న్ ఫారాల పంపిణీ – 31.71 శాతం మేర పూర్త‌యిన ఫారాల డిజిటైజేష‌న్‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఓటరు జాబితాలో క‌చ్చిత‌త్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని, అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా బ‌య‌ట లేకుండా.. అన‌ర్హులెవ‌రూ జాబితాలో లేకుండా స్వ‌చ్ఛ‌మైన‌, స‌మ‌గ్ర ఓట‌రు జాబితా రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »

శ్ర‌మ జీవుల ఉపాధికి స‌రికొత్త భ‌రోసా..

– వీబీ జీ రామ్ జీతో గ్రామీణ కుటుంబాల జీవ‌నోపాధికి భ‌ద్ర‌త‌ – స‌మాజం, గ్రామం, శ్రామికుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం – మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి మ‌రో పెద్ద ముంద‌డుగు – 100 రోజుల పని పరిమితిని 125 రోజులకు పెంపు – వేత‌నం రూ. 307 నుంచి రూ. 312కు పెంచుతూ ఆర్థిక చేయూత‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ @ 2047 దార్శ‌నిక‌త‌కు …

Read More »

ఏ ఈ ఆర్ వో లు, BLOల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై దిశానిర్దేశం ఇవ్వాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం లక్ష్మీ నగర్ కాలనీ , ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఏర్పాటుచేసిన సెంట్రల్ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ లో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ల (BLOలు)తో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలు ఏవి …

Read More »

నగరవ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ నగరవ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం నగరంలోని అన్ని సర్కిళ్లు, డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ నుంచి నీటి నమూనాలను సేకరించి రెసిడ్యువల్ క్లోరిన్ (ఆర్‌సీ) పరీక్షలను నిర్వహించారు. తాగునీటిలో నిర్దేశిత స్థాయిలో క్లోరిన్ ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ద్వారా …

Read More »

బుడమీరులో గుర్రపుడెక్కులు తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బుడమేరు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం ఉదయం సర్కిల్-2 పరిధిలోని 30వ డివిజన్ రామకృష్ణపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్కను తొలగించేందుకు లాంగ్ ఆర్మ్, ట్రక్సర్, బోట్లను వినియోగిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలంలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు …

Read More »

ప్రజా దర్బార్ తో సమస్యల పరిష్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ భవానీపురం ,ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు , మహ్మద్ అబ్దుల్ ఖాదర్ కూటమి నేతలతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి పరిష్కరించేందుకు …

Read More »

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లోటీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. దేవాలయానికి విచ్చేసిన వారికి ఆలయ కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను …

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 దరఖాస్తులు స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యముల పాఠశాలలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరికీ తెలియచేయునది ఏమనగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 నకు ఎంపిక చేయుటకు గాను మార్గదర్శకాలు మరియు Timelines రాష్ట్రం లోని RJDSE లకు , జిల్లా విద్యాశాఖాధికారి మరియు Additional Project Coordinators of SS లకు తెలియజేయడం జరిగింది. దీనిలో 3 రకాలుగా ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరుగుతుంది. 1) Self Nomination – Each Category one 2) Recommended by …

Read More »