Breaking News

Monthly Archives: July 2026

మినీ ల్యాబ్ లు మీ చెంతకే..

-విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి.. -శాస్త్రీయ దృక్ప‌థానికి స‌రైన ప్రోత్సాహం అందిస్తున్నాం -ప్ర‌యోగాల ద్వారా నైపుణ్యాల సాధ‌న‌కు సైన్స్ కిట్ల పంపిణీ -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అంద‌జేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని సీవీఆర్ మునిసిప‌ల్ హైస్కూల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస్త్ర సాంకేతిక మండ‌లి (ఆప్కాస్ట్‌) సౌజ‌న్యంతో పాఠ‌శాల విద్యాశాఖ‌, స‌మ‌గ్ర‌శిక్ష‌, లీప్‌, ఎస్‌సీఈఆర్‌టీ, …

Read More »

మహారాష్ట్ర లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధుల విజ్ఞాన యాత్ర

– డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, కళావేదికను సందర్శించిన మేయర్, కార్పొరేటర్లు – ప్రాజెక్టు నిర్మాణ విశిష్ట‌త‌ను వివ‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మేయర్ బాలచంద్ర కంబుల్, కార్పొరేటర్లు, అధికారుల బృందం మంగళవారం విజయవాడలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం, అంబేద్కర్ కళావేదికను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించింది. ఈ సందర్భంగా బందర్ రోడ్–ఎంజీ రోడ్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి …

Read More »

ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యం – వీఎంసీ

-నగరంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో నగరంలోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, కార్యాలయ భవనాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు మరియు ప్రజలు అధికంగా సందర్శించే ఇతర భవనాల్లో ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎం.జి రోడ్లో గల చెన్నై షాపింగ్ మాల్ లో వియంసి ఫైర్ సిబ్బంది ఆకస్మికతనికి నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనాల్లో ఏర్పాటు …

Read More »

నగరవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ గోపాల్ నాయక్ తెలిపారు. మంగళవారం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఆకస్మిక ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. సర్కిల్ కి 18, మొత్తం 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాలు, రిటైల్ షాపులు, సూపర్ మార్కెట్లు, వాణిజ్య సంస్థలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. …

Read More »

ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి… : నెట్టెం రఘురాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఇన్నాం భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి, రైతులకు, భూముల యజమానులకు శాశ్వత న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఈ …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైపుణ్య విద్యే లక్ష్యం

-సమగ్ర శిక్ష ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు IAS.,  -విజయవాడ లయోలా క్యాంపస్‌లోని YES-J సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 3 రోజుల KRP శిక్షణా కార్యక్రమం -రాష్ట్రంలో 1,599 పాఠశాలల్లో నైపుణ్య విద్య అమలు -వొకేషనల్ ట్రైనర్ల గౌరవ వేతనం 12 నెలలకు పొడిగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పాఠశాల విద్య పూర్తి చేసి బయటకు వచ్చే సమయానికి కనీసం ఒక వృత్తి నైపుణ్యాన్ని తప్పనిసరిగా నేర్చుకునేలా తీర్చిదిద్దడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని సమగ్ర శిక్ష …

Read More »

ప్రజా సమస్యల పరిష్కరించలేని పాలకులకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పట్టని పాలకులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ నగర్ కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక 49వ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ నాయకులూ చేపూరి నాగేశ్వరరావు  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ నగర్ కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గాని ప్రజా సమస్యల పట్ల …

Read More »

ధర్మేంద్ర ప్రధాన్‌కు సత్కారం సిగ్గుచేటు

-మళ్లీ ఆరెస్సెస్ వ్యక్తికే కేంద్ర విద్యాశాఖ పగ్గాలా? -ఎన్‌టీఏ, ఎన్ ఈపీని రద్దు వరకు ఉద్యమం -విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి -కాక్రోచ్ ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు -బొద్దింకలకు భయపడుతున్న మోదీ, అమిత్‌షా -ఏపీలో తీవ్రమైన కరువు పరిస్థితులు -కరువు తీవ్రతపై సీఎం చంద్రబాబు స్పందించాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతయినా బుద్ధి రాలేదని, రాజీనామా చేసిన ఎంపీని పార్లమెంట్‌లో బీజేపీ …

Read More »

హంద్రీనీవాతో కుప్పానికి జలకళ

-కుప్పంలో పర్యాటకరంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకదృష్టి -స్థానికంగా పరిశ్రమల రాకతో వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు -మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి- ఆర్థిక శక్తిగా ఎదగాలి -కుప్పం నియెజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో ఉపాది, ఉద్యోగ అవకాశాలు …

Read More »

ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు

-ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు మారాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో …

Read More »