Breaking News

Daily Archives: February 7, 2025

జిల్లా తరఫున దక్షిణ భారత జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంపలగూడెం మోడల్ స్కూల్ విద్యార్థి సుదక్ష తన ప్రాజెక్టుతో దక్షిణ భారత జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ లో పాల్గొని విజేతగా నిలిచినందుకు ఈరోజు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందించడం జరిగినది. జగ్గయ్యపేట జిల్లా పరిషత్తు బాయ్స్ హైస్కూల్ తరఫున పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు భార్గవ్, చైతన్య గ్రూపు ప్రాజెక్టుకు దక్షిణ భారత స్థాయిలో అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. పుదుచ్చేరిలో జనవరి 20 నుంచి 25 వరకు జరిగిన దక్షిణ భారత జాతీయ స్థాయి …

Read More »

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల్సిందే..

– చెక్ పోస్టుల్లో సీసీ టీవీల సంఖ్య‌ను పెంచండి – జాయింట్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయండి – జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని.. అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ (డీఎల్ఎస్ఏ) స‌మావేశం జ‌రిగింది. ప్ర‌స్తుతం …

Read More »

వాయు నాణ్య‌త‌లో విజ‌య‌వాడ‌ను ముందంజ‌లో నిల‌పాలి

– స‌త్ఫ‌లిస్తున్న పీసీబీ, వీఎంసీల విస్తృత కార్య‌క్ర‌మాలు – మ‌రిన్ని వినూత్న ఆలోచ‌న‌ల‌తో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలినందిద్దాం.. – ఎల‌క్ట్రిక్‌/సోలార్ రిక్షాల వినియోగం దిశ‌గా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించాలి – వాయు నాణ్య‌త‌ను పెంచేందుకు డ్రోన్ల‌ను ఉప‌యోగించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు పీల్చే గాలి అత్యంత కీల‌క‌మైంద‌ని, అది విష‌తుల్యం కాకుండా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలో పీసీబీ, వీఎంసీలు.. వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లిస్తున్నాయ‌ని, ఇక‌పైనా మ‌రిన్ని వినూత్న …

Read More »

ఎంఎస్ఎంఈ స‌ర్వేలో వేగం పెంచండి

– పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి స‌ర్వే ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది – య‌జ‌మానుల‌కు ఆర్థికంగా చేయూత‌నిచ్చేందుకు దోహ‌దం చేస్తుంది – యూనిట్ నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌రిచే శిక్ష‌ణ అందించేందుకూ వీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేప‌ట్టిన సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ల (ఎంఎస్ఎంఈ) స‌ర్వేలో వేగం పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి సిబ్బందిని ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఇబ్ర‌హీంప‌ట్నం మూల‌పాడులో గ్రామ స‌చివాల‌య సిబ్బంది …

Read More »

అంబాపురం సర్పంచ్ కబ్జా కోరల నుంచి నా స్థలాన్ని కాపాడండి రిటైర్డ్ ఆఫీసర్ పుల్ల జకరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హై కోర్ట్ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామపంచాయితీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కొరల నుండి నన్ను కాపాడాలని కమర్షియల్ టాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జకరయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నెంబర్ 96 /2 లో వున్నా స్థలాన్ని 2024 లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే …

Read More »

విద్యార్థుల‌కు కీలక సమయం.. అలసత్వం వద్దు..

– పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయండి.. – చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. – ఉపాధ్యాయులకు అత్యవసరమైతేనే శెలవు మంజూరు – జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 30 రోజులు అత్యంత కీలక సమయ‌మ‌ని.. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్దం చేయడంతో పాటు వివిధ స‌బ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేయాలని, అత్యవసరమైతే తప్ప …

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎన్జీవో భవనం ఒక వేదిక కావాలి

-ఎన్జీవో భవనానికి సజ్జ రామారావు ఎన్జీవో భవనంగా నామకరణ ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ ఉయ్యురు, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎదురైన సమస్యలను చర్చించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్జీవో హోమ్ ఒక వేదికల కావాలని ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అన్నారు. స్థానిక గండిగుంట బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీజీఓస్ భవనంను శుక్రవారంనాడు ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, ఎ విద్యా సాగర్ …

Read More »

విశాఖ గాజువాక ‘సంసిధ్’ స్కూల్ లో కోలాహలంగా వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్టణం గాజువాక బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో కోలాహలం గా జరిగాయి. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ప్రధానోపాధ్యాయులు జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ శెట్టి, కో ఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరావు, సుమ ప్రియ, అశ్విని, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.

Read More »

ఘనంగా ఉల్లాస్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలోని 4,15,000 మంది నిరాక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని భారత ప్రభుత్వ వయోజన విద్య అండర్ సెక్రటరీ PRADEEP B. HEDAOO అన్నారు. పోరంకిలోని మురళి రిసార్టులో వయోజన విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒక రోజు ‘ఉల్లాస్ మేళా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ వయోజన విద్యా సంచాలకులు కృతికా శుక్లా IAS.,  అన్ని …

Read More »

విజయవాడలో చిల్లపల్లీస్ వీవర్లి ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత పరిశ్రమలో ఐదు దశాబ్దాల అనుభవం మరియు వారసత్వం ఉన్న సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వారి చిల్లపల్లీస్ వీవర్లి విజయవాడ లోని బృందావన్ కాలనీ లోని ఏ కన్వెన్షన్ ఎదురుగా శుక్రవారం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ బ్రాంచ్ తో కస్టమర్ల ఆదరణను మరియు అభిమానాన్ని సంపాదించిన చిల్లపల్లీస్ వీవర్లి ఇప్పుడు విజయవాడకు తన ఉనికిని విస్తరించింది. షోరూంను ప్రఖ్యాత వాణిజ్యవేత్త వల్లూరు అశోక్ బాబు ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మొదటి కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా ఎం …

Read More »