Breaking News

Daily Archives: February 15, 2025

మైక్రో అబ్జర్వర్స్ గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్లో అందించాలి

– కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులను నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులు మూడు నాలుగు జిల్లాలలో చెందిన ఎన్నికల …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రా లక్ష్యంతో వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేద్దాం

-కలెక్టరేట్ లో 3 వ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమం లో భాగంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టీరేట్ ఆవరణలో మొక్కను …

Read More »

“ స్వచ్ఛంద్ర – క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : మూలం- వనరులు నేపథ్యంలో “ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర “ కార్యక్రమాన్ని మూడో శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంతమణి తెలియ చేశారు. వైటీసీ ఆవరణలో శనివారం “ స్వచ్ఛంద్ర – క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి , జిల్లా సూక్ష్మ సేద్య అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారి, …

Read More »

ఐదేళ్ల‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక్క మంచి ప‌నీ చేయ‌లేదు

-ఉపాధ్యాయుల‌కు బార్ లు, బాత్రూముల ద‌గ్గ‌ర విధులు సిగ్గుచేటు -64 ల‌క్ష‌ల మందికి… రూ.33 వేల కోట్లు పెన్ష‌న్ పంపిణీ -ఏడు నెల‌ల్లో జ‌రిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరించండి -కూట‌మి అభ్య‌ర్థికి ఓటేయ‌మ‌ని ధైర్యంగా అడ‌గండి -ఐదేళ్లుగా ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఉద్యోగాలు లేవు -జ‌గ‌న్ ట్రాప్ లో ఎవ‌రూ పడొద్దు -ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మీక్ష సమావేశాల్లో ప‌. గో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి తాడేపల్లిగూడెం/తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం తథ్యం అని ప‌.గో జిల్లా ఇన్ఛార్జ్ …

Read More »

మల్లాది విష్ణు చేతులమీదుగా వైసీపీ డివిజన్ కార్యాలయం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు డివిజన్ కార్యాలయాలు దోహదపడతాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శివాజీకేఫ్ సెంటర్ నందు స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో డివిజన్ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో.. ఒక్క …

Read More »

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం…

-క్రమశిక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట -శిరస్త్రాణం ధరించడం ఒక ఫ్యాషన్ గా మారాలి… -ప్రతీ ఒక్కరు బాధ్యతగల పౌరులుగా మెలగాలి. -సృష్టి లో ప్రాణానికి మించిన విలువైన ఆస్తి లేదు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రహదారులపై జరిగే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా రహదారుల భద్రత, రవాణా శాఖల సూచించిన నిర్దిష్ట ప్రమాణాలు పాటించటం తో పాటు ద్విచక్ర వాహన దారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి ఎన్టీఆర్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు …

Read More »

భారత్ టెక్స్ 2024లో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్

-పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలను హైలైట్ చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ నూతన …

Read More »

యోగ శక్తి చికిత్స నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ… : డా. మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ చేయడం మంచి ఫలితాలు సాధించవచ్చునని యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ మాకాల సత్యనారాయణ తెలిపారు. మనలో నాడీ అనేది సృష్టికర్త ద్వారా మనలో ఏర్పాటు చేయబడి మన 12 అవయవాల పనితీరులో హెచ్చుతగ్గులు కనిపెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే విధానం భారతదేశం లో వేల సంవత్సరాలుగా వాడబడినది అని దీనిని యోగ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో వాడుతున్నారని చెప్పారు. …

Read More »

శ్రీ భవానీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని శ్రీ భవానీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం జరిగింది. శనివారం నాగార్జునవీధి, స్వాతి సినిమా హాల్‌ దగ్గర, భవానీపురం, విజయవాడలోని శ్రీ భవానీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం జరిగిన సందర్భంగా నిర్వాహకులు హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెనిగళ్ళ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నగరంలోని చుట్టుప్రక్కల ప్రాంతాలలో, గ్రామాలలో పలు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని అలాగే నగరంలోని పేద, మధ్య తరగతి వారి కోసం శ్రీ భవానీ హాస్పిటల్‌ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని …

Read More »