Breaking News

Monthly Archives: March 2025

మచిలీపట్నంకు చేరుకున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ

-టీమ్ కు ఘన స్వాగతం పలికిన అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు గల భద్రతను అందిస్తున్న పారామిలటరీ దళం అయినటువంటి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం మచిలీపట్నం కు చేరుకుంది. సైకిల్ ర్యాలీ టీమ్ కు జిల్లా అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బ్యాండ్ మేళంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ వెలుపల …

Read More »

సవాళ్లు ఎదురైతే సకాలంలో పరిష్కరించి అమలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనుల అమలు పర్యవేక్షణకు, పరిపాలన పటిష్టపరుచుటకు, ఏమైనా సవాళ్లు ఎదురైతే సకాలంలో పరిష్కరించి అమలు చేయుటకు, అంతర శాఖల సమావేశం సమన్వయం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్చార్జ్ అధికారులుగా ఇటీవల నియమించింది. ఇందులో భాగంగా జిల్లా ఇన్చార్జి అధికారిగా నియమించబడిన డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ గురువారం నగరంలోని కలెక్టరేట్కు రాగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే …

Read More »

కర్మయోగి భారత్ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులందరూ ఈనెల 26వ తేదీలోగా కర్మయోగి భారత్ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ఐ గాట్ కర్మయోగి భారత్ శిక్షణ కార్యక్రమంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి ఎఫ్ ఎం ఎస్ …

Read More »

ప్రాధాన్యత అంశాలపై నివేదికలు అందించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25, 26 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు కలిగిన నివేదికను తక్షణమే సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం ఉదయం కేదారేశ్వరపేట, ఫ్రూట్ మార్కెట్ లోని కోల్డ్ స్టోరేజ్ షాపులు అయినా గుప్తా ఎంటర్ప్రైసెస్,ఆంజనేయ శర్మ రైపెనింగ్ ఛాంబర్స్,శ్రీ లక్ష్మి గణేష్ ఫ్రూట్స్, మరియు బిస్మిల్లా జహీరు ఫ్రూట్స్ తనిఖీ చేసారు ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ వారితోనే ఆపరేట్ చేయించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, …

Read More »

శాఖాధిపతులతో కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చ్ 25, 2025 న జరిగే కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో బుధవారం ఉదయం శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

ఎస్సీ 59 కులాలకు అన్నిరంగాల్లో సమన్యాయం జరగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బేడ బుడగ జంగాల ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ 59 కులాలకి అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని బేడ, బుడగ, జంగాల, సంఘం జాతీయ అధ్యక్షులు తాడికొండ నారాయణ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేడా, బుడగ, జంగం కులము ఎస్సీ వర్గీకరణలో ఎ గ్రూపులో చేరుస్తూ క్యాబినెట్ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రంలో జాతీయ కమిషన్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం …

Read More »

మహిళలకు రక్షణ పోష్ చట్టం గురించి అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పనిచేసే ప్రదేశలలో లైంగిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ పోష్ (POSH) చట్టం గురించి వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో అవగాహన సదస్సును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ నిర్వహించారు. ఈ సంధర్భం గా పోలీసు కమిషనర్మాట్లాడుతూ… పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు అనేది చిన్న విషయం కాదు దీన్ని ఈజీగా తీసుకోకూడదు. ఈ విషయంలో మహిళలు మౌనంగా ఉండకుండా నిర్భయంగా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని దానికోసం పోషె …

Read More »

ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపి సిఎం చంద్రబాబు భేటీ

-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం -ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం -బిల్ గేట్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఖర్చు తగ్గింపు, ఉపాధి కల్పన …

Read More »

ఢిల్లీలో 4 వ జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ (NSAC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిథ్యం వహించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

-భారత్ మారిటైమ్ రంగ అభివృద్ధి కోసం తీరప్రాంత రాష్ట్రాలను ఏకం చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.. -నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, మారిటైమ్ రంగంలో వృద్ధితో భారత్ గ్లోబల్ మారిటైమ్ పవర్ హౌస్ గా రూపాంతరం చెందనుంది. -స్వర్ణ ఆంధ్ర @ 2047 ద్వారా భారత్ మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. -చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ మారిటైమ్ రంగం అభివృద్ధికి అనేక కీలకమైన చర్యలు చేపట్టాం.. -రూ. …

Read More »