గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “భారతదేశ అభివృద్ధి , ప్రగతి అనేది ఆధునిక సాంకేతిక విధానాలతో సాధ్యం అవుతుందని , దేశంలో ఆంధ్రప్రదేశ్ తో సహా ఏడు రాష్ట్రాలు భూ సర్వే డిజిటలైజేషన్లో ముందడుగులో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్ లో కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే …
Read More »Daily Archives: May 16, 2025
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వితరణ..
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంథాలయ సంస్థలో పనిచేసిన పదవీ విరమణ చేసిన అక్కినేని అచ్చమాంబ ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 ఎస్ టైప్ కుర్చీలు, ఒక వాటర్ ఫిల్టర్, రీడింగ్ ప్యాడ్లు, రెండు లక్షల నర విలువచేసే ఫర్నిచర్ ను ప్రభుత్వ రాష్ట్ర ప్రాంతీయ గ్రంథాలయానికి అందచేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా …
Read More »రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు… : జిల్లా రెవెన్యూ అధికారి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) కమిటీలోని అధికారులతో చర్చించారు. ఈ …
Read More »డెంగ్యూ వ్యాధి మీద అందరూ అవగాహన కలిగి ఉండాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు వారి కార్యాలయం ఆవరణలో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2016 సంవత్సరం నుండి మే 16 తారీఖున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ ఉద్దేశ్యం వర్షాకాల ప్రారంభంలో జనాలకు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధి మీద అందరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కే.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ …
Read More »దేశం కోసం సైన్యం – సైన్యం కోసం మనం
– తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ‘‘ఆపరేషన్ సింధూర్’’ చేపట్టి ప్రపంచానికి మన సైనిక శక్తి సామర్ధ్యాన్ని తెలియచేశామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో తిరంగ యాత్ర – దేశ భక్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలియచేశారు. ఆపరేషన్ …
Read More »కార్మగారములలో భద్రత ప్రమాణాలు తప్పన పాటించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మగారములలో భద్రత ప్రమాణాలు తప్పన పాటించాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జిల్లా ఫ్యాక్టరీ విభాగం ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ఉన్న పలు పరిశ్రమలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, పరిశ్రమల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో కొన్ని నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తనిఖీలు నిర్వహించాల్సి …
Read More »ప్రతినెలా మూడోవ శనివారం స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం
-మే నెల కాన్సెప్ట్ బీట్ హిట్ నేపథ్యంలో “నీరు – మీరు” కార్యక్రమం -జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు సూచనలు -జె సి ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రతి రహదారి మార్గంలో, పల్లెల్లో , ప్రధాన కూడళ్లలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జేసి ఛాంబర్ లో స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా …
Read More »వర్షానికి నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాబోవు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలో విరిగిన చెట్లను తొలగించడం, హోర్డింగ్స్ ని తొలగించడం, నీరు నిలిచిన ప్రాంతాల్లో బెయిల్ అవుట్ ను యుద్దప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ గారు 3 వంతెనలు, అరండల్ …
Read More »ఐటిసి ఫినిష్ సంస్థ వాతావరణ కాలుష్య నియంత్రణపై పోస్టర్ ఆవిష్కరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడం ద్వారా, దాని ద్వారా ఏర్పడే వేడి వాతావరణంను తగ్గించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం ఐటిసి ఫినిష్ సంస్థ వాతావరణ కాలుష్య నియంత్రణపై రూపొందించిన వాల్ పోస్టర్ ని ఐటిసి ఫినిష్ నారయణ, పర్యావరణ విద్య నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో పర్యావరణ కాలుష్యమన్నారు. పర్యావరణ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు, సంస్థలతో పాటుగా …
Read More »ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,468 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు మధ్యాహ్నం తర్వాత జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురువారం మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1,468 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 24 జనరల్, 11 ఒకేషనల్ కేంద్రాల్లో మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ -II, …
Read More »
Prajavartha Online Telugu News