Breaking News

Daily Archives: May 21, 2025

చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు

-కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగ జాతరలో పాల్గొని, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు కుప్పం నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, …

Read More »

ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్పవరం యోగా

-యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీదే -ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి -విశాఖ వేదికగా జూన్ 21న ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షల మందితో కార్యక్రమం -రికార్డు సృష్టించేలా నేటి నుంచి నెలరోజులపాటు యోగాంధ్ర -2025 నిర్వహణ -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న …

Read More »

గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని తొలగించబోం-ఆందోళన చెందవద్దు

-గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు -ఎబిసి కేటగిరీలుగా సచివాలయాల విభజన సిబ్బంది సర్దుబాటుకు చర్యలు -సిబ్బంది సర్దుబాటు చేశాకే సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపడతాం -సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం -రాష్ట్రమంత్రి డా.శ్రీబాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరినీ తొలగించ బోమని అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక

-రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్  -పవన్ కళ్యాణ్ కి లాంఛనంగా కుంకీ ఏనుగులు అందజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ , అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే -గజ పూజ చేసి ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య …

Read More »

నాణ్యమైన వరి, ఉద్యాన వన పంటల సాగును ప్రోత్సహించాలి

-ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, పంట మళ్లింపును ప్రోత్సహించాలి -వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాదించే విధంగా చర్యలు -నూతన సాంకేతికను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు పెద్ద ఎత్తున వినియోగించాలి -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నాణ్యమైన వరి సాగుతో పాటు ఉద్యానవన పంటల సాగను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థకం మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ అనుబంధ …

Read More »

యోగాంధ్ర‌కు శ్రీ‌కారం చుట్టిన జిల్లా యంత్రాంగం

-అట్టహాసంగా ప్రారంభం అయిన 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21 సంబంధించిన క్యాంపెయిన్ యోగాంధ్ర 2025 -యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగ‌స్వామ్యం కావాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -యోగాను నిత్యం ప్ర‌తి ఒక్క‌రు గంట పాటు చేసి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగ‌స్వామ్యం కావాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ …

Read More »

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టండి…

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రహదారి భద్రత సమావేశం ఈరోజు రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కా ప్రణాళికతో కృషి చేయాలని, టూవీలర్ వాహనాల చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్టానిక కలెక్టరేట్ వీడియో కాన్పిరన్స్ హాలు నందు జరిగిన జాతీయ రహదారుల పై నిత్యం జరిగే ప్రమాదాలపై జిల్లా రహదారి భద్రత …

Read More »

కళాబృందాలచే హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ, సుఖ వ్యాధుల పై అవగాహన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి కార్యాలయం నందు, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకుల వారి ఆదేశానుసారం దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి హెచ్ఐవి/ఎయిడ్స్ క్షయ, సుఖ వ్యాధుల పైన జిల్లా స్థాయిలో కళాబృందాలచే నాటికలు, పాటలు, కథల రూపంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రెండు కళాబృందాలు చే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ మురళి, …

Read More »

రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

-అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రారంభోత్సవం -సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ఎమ్మెల్యే విజయశ్రీ తో కలిసి ప్రారంభించనున్న పెమ్మసాని  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి …

Read More »

కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం

-ఎన్ని ఇబ్బందులొచ్చినా కార్యకర్తలను కాపాడుకుంటాం -జిల్లాలో టీడీపీ కుటుంబాల‌ను త‌రిమికొట్టారు -పల్నాడులో తోట చంద్రయ్యను అతి దారుణంగా చంపారు -చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో అండగా నిలుస్తున్నాం -సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి రెండు కళ్లు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ న‌ర‌స‌రావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావు పేట‌లో బుధ‌వారం జ‌రిగిన జిల్లా మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి …

Read More »