-ప్రజా అవసరాల మేరకే విద్యుత్ ఒప్పందాలు -పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతో రాష్ట్రాభివృద్ధి -యాక్సిస్ తో యువతకు ఉద్యోగ అవకాశాలు, ఖజానాకు పన్నుల లబ్ధి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ …
Read More »Daily Archives: May 5, 2025
రెడ్ క్రాస్ అవార్డుకు ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి
-మానవీయ సేవలలో అగ్రగామిగా అత్యున్నత పనితీరును చూపిన చదలవాడ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవీయ సేవల్లో మెరుగైన పనితీరుకు గుర్తింపుగా పశ్చిమ గోదావరి కలెక్టర్, జిల్లా మేజిస్టేట్ చదలవాడ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇటీవల ముంచెత్తిన వరదలలో స్థానిక ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నంలో నాగరాణి చేసిన కృషి గుర్తింపుగా 2023–24, 2024–25 సంవత్సరాలకు గాను రెడ్ క్రాస్ ఈ అవార్డును ప్రకటించింది. కనీస రవాణా సదుపాయాలు సైతం అందుబాటులోకి రాని విపత్కర తుఫాను …
Read More »మద్యం కుంభకోణంలో సంబంధించిన వారిపై విచారణ చేయాలి… : నేతి ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తులు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలూకా సుమారు 3200 కోట్లకు పైగా నిధులు మధ్యం కంపెనీలనుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ …
Read More »8 నుంచి చెస్ ఉచిత శిక్షణ శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గ్లోబల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి చెస్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిం చనున్నట్లు ఆ అకాడమీ కార్యదర్శి షేక్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొగ ల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ పక్కనే ఉన్న తమ అకాడమీలో జూన్ ఎనిమిదో తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 98495 14138 నంబరును సంప్రదించి, పేర్లను రిజి స్టర్ చేసుకోవాలని సూచించారు.
Read More »అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోండి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షాలకు, పెనుగాలులకు పండ్ల రైతులందరికీ నష్ట పరిహారం అందించాలని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేసారు. మిర్చిధర లేదు, ధాన్యం లోడు ఎత్తిన వాటికి దిగుమతులు లేవు. ఈ లోపే చేతికి వచ్చిన పంట నేలపాలైతే రైతుకు చాలా బాధ కలుగుతుందని అని అన్నారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు …
Read More »అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. పర్యటన ఆసాంతం సక్సెస్ అయ్యేలా సమన్వయం కోసం అన్ని స్ధాయిల్లో వాట్సాప్ గ్రూపులు …
Read More »కేంద్ర ప్రభుత్వం సహకారంతో విశాఖపట్నంలో రూ.172 కోట్లతో పని చేసే మహిళల హాస్టళ్ళ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా స్వావలంబనకు, మహిళల జీవన నాణ్యతకు తోడ్పడే ఉద్దేశ్యంతో — పని చేస్తున్న మహిళలకు సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు — విశాఖపట్నంలో మూడు చోట్ల పని చేసే మహిళల హాస్టళ్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP – హాస్టల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానిదే ఉంటుంది, అయితే నిర్వహణ మరియు నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు అప్పగించబడతాయి)విధానంలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (GVSCCL) …
Read More »ఏడాదంతా కార్యక్రమాలతో రాష్ట్ర పర్యాటకరంగానికి కొత్తశోభ
-8 మెగా ఈవెంట్స్, 11 నేషనల్ ఫెయిర్స్, 10 ఇంటర్నేషనల్ ఫెయిర్స్ -గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్‌స్టేలు -త్వరలో 150 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు -ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్‌కు ప్రమోషన్ -20 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం కావాలి -పర్యాటకరంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -‘ఫెస్టివల్ క్యాలెండర్’ రూపకల్పనకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని…ఇందుకోసం ‘టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్’ రూపొందించాలని …
Read More »20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-కర్నూలు జిల్లా గుట్టపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించిన మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 …
Read More »ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యత
-ఏడాది కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రాజెక్టు-5.00 లక్షలు -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వ సేవలను ఎంత మెరుగ్గా ప్రజలకు అందించబడుతున్నాయి …
Read More »
Prajavartha Online Telugu News