Breaking News

Daily Archives: May 21, 2025

అమృత్ స్టేషన్‌గా సూళ్లూరుపేట – అభివృద్ధికి ప్రతీక…. : ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా, అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. రైల్వే సేవలను, మౌలిక వసతులను ఆధునీకరించడం లో బాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ స్టేషన్ గా ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా అమృత్ స్టేషన్ లని జాతికి అంకితమివ్వడంలో బాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ని కూడా మే 22వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు జాతికి అంకితమివ్వనున్నారు. ఈ సందర్బంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ …

Read More »

వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, మంట పారాధన, కలశ స్థాపన అనంతరం శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన, సిందూరార్చన నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ హోమాలు అనంతరం శ్రీ అనఘా వ్రతం నిర్వహించి, సాయంత్రం శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు శ్రీ కప్పగంతు …

Read More »

లబ్ధిదారుల గృహంలో స్వయంగా టీ కాచి లబ్ధిదారులకు అందజేసి, తాను సేవించిన అజయ్ జైన్…

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం పథకం పేదింటి మహిళల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందని, సంవత్సరానికి మూడు …

Read More »

సెప్టెంబర్ 30 నాటికి నాటు సారా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్

-రాష్ట్ర అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా నుండి పూర్తిగా విముక్తం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్సైజ్, జిఏడి-రాజకీయం) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎక్సైజ్) ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలోని అన్ని …

Read More »

పెనుకొండ లో అంబరాన్ని అంటిన మినీ మహానాడు మహోత్సవం

-పండుగ వాతావరణంలో పెనుకొండ టీడీపీ 2025 మినీ మహానాడు. -మినీ మహనాడులో పలు కీలక అంశాలపై తీర్మానాలు -అభివృధ్ధికి మారు పేరు తేదెపా -స్కాంరెడ్డి పని ఐపోయింది -ఐదేళ్ళళో వైసిపి చేయని అభివృధ్ధి పది నెలల్లో చేసి చూపాం -అమృత్ పథకం ద్వారా పెనుకోండ మున్సిపాలిటీ లో 100 కోట్లతో ఇంటింటికి తాగునీరు మంత్రి సవితమ్మ పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మినీ మహనాడు లో భాగంగా బుధవారం పెనుకోండలో మిని మహనాడు రాష్ట్ర బిసి సంక్షేమం,చేనేత …

Read More »

అందుబాటులో డీఎస్సీ మాక్ టెస్టులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి -2025 కి దరఖాస్తుచేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సిద్ధంకావడానికి వీలుగా మాక్ టెస్ట్ లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు DSC వెబ్సైట్ https://apdsc.apcfss.in లో మాక్ టెస్ట్ లను వినియోగించుకోవాలని డైరెక్టర్, పాఠశాల విద్య వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Read More »

తూర్పు నాబార్డ్ డిడిఏం గా చక్రధర్ రావూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నాబార్డ్ జిల్లా అభివృధి మేనేజర్ (డి డి ఎమ్) గా చక్రధర్ రావూరి కొత్త గా పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసిన చక్రధర్ బదలీపై తూర్పు గోదావరి జిల్లా కు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు జిల్లాలకు ఏ జి ఎమ్ గా వ్యవహరించిన డా వై ఎస్ నాయుడు కాకినాడ, కోనసీమ జిల్లాల నాబార్డ్ ఏజీఏం గా …

Read More »

తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను

– ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను – నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు – మంత్రిమండలి ఆమోదం తెలిపింది – ఇది కూటమి ప్రభుత్వ విజయం – మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు – మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి …

Read More »

మన ధరిత్రి మన ఆరోగ్యం

-జూన్ 21 వరకు యోగపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు -మంత్రం కందుల దుర్గెష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యంn(“యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్”) అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక …

Read More »

భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక-గోవా తీరాల నుండి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40-50కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర …

Read More »