Breaking News

Monthly Archives: June 2025

ప‌ర్యావ‌ర‌ణ హిత మార్గాలు.. న‌వ్య ప‌రిశ్ర‌మ‌ల‌కు సోపానాలు

– ప్లాస్టిక్ ప్ర‌త్యామ్నాయ ఉత్ప‌త్తుల త‌యారీపై అవ‌గాహ‌న క‌ల్పించాలి – కొత్త యూనిట్లు ఏర్పాటు దిశ‌గా యువ‌త‌ను, మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచానికి ప్లాస్టిక్ కాలుష్యం పెను స‌వాలుగా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ప్లాస్టిక్‌కు ప్ర‌త్యామ్నాయ ఉత్ప‌త్తుల త‌యారీతో ముఖ్యంగా యువ‌త, మ‌హిళ‌లు కొత్త పారిశ్రామిక యూనిట్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా, పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గొచ్చ‌ని, ఈ విష‌యంపై స‌మ‌న్వ‌య శాఖ‌లు అవగాహ‌న క‌ల్పించ‌డంతో పాటు ప్రోత్స‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు సహకరించండి..

-అర్హులైన యువ ఓటర్ల నమోదు దిశగా ప్రోత్సహించండి.. -డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దోషరహిత, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడంలో రాజకీయ పక్షాలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని అర్హులైన యువ ఓటర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లోని ఎవిఎస్‌ఎన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్‌వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో …

Read More »

తిరుపతిలో అంతర్జాతీయ రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్‌లో 101 ఒప్పందాలు కుదుర్చిన MSMEs

– ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఇల కోసం గ్లోబల్ అవకాశాలు తెరచిన వేళ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఇ అభివృద్ధి సంస్థ (AP MSME DC) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ రివర్స్ బయ్యర్-సెల్లర్ మీట్ (RBSM) తిరుపతిలో విజయవంతంగా ముగిసింది. జూన్ 26 నుండి 28 వరకు మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి మరియు పరిసర జిల్లాల నుండి 350కిపైగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSMEs) …

Read More »

కోవె వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణా శిభిరం సంపూర్ణం

-ఔత్సాహిక విద్యార్థి వ్యాపారవేత్తలకు సువర్ణవకాశం -కాన్ఫెడరేషన్ అఫ్ విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 28వ తేదీన విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల లో కాన్ఫిడెరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రెప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో నలబై ఐదు రోజుల పాటు జరిగిన పళ్ళ రసాలు తయారీ పై వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణా శిభిరం లో శిక్షణ పొందిన విద్యార్థినులకు స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ జసింతా క్వాడ్రస్ , కోవె అధ్యక్షురాలు యార్లగడ్డ గీతాశ్రీకాంత్ ధ్రువీకరణ …

Read More »

జూలై 9న సమ్మెను గ్రామీణ హర్తాళ్ల్ ను విజయవంతం చేయాలి…

-రైతు నేతల పిలుపు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఇండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను తిరస్కరించాలని తద్వారా దేశీయ రైతాంగానికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం పంటలు పండే భూములను లక్షలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.రైతు, ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రైతులు, కౌలురైతులు, కార్మికులు, …

Read More »

ఇస్కాన్ ఆధ్వర్యంలో కన్నుల విందుగా జరిగిన ” శ్రీ జగన్నాథ రథయాత్ర

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్కాన్ విజయవాడ వారు” శ్రీ జగన్నాథ రథయాత్ర “ని ఈరోజు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సితార గ్రౌండ్స్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు రథపూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం 3 గంటలకు రథయాత్ర వేలాది మంది భక్తులు మరియు కళాకారుల బృందాలతోనూ ఇతర రాష్ట్రాల మరియు దేశ విదేశీయ భక్తులతోనూ సితార గ్రౌండ్స్ దగ్గర ప్రారంభమైన రథయాత్ర శివాలయం సెంటర్, స్వాతి థియేటర్ మీదుగా కుమ్మరి పాలెం సెంటర్ రథం సెంటర్ దాటుతూ సీతమ్మ వారి …

Read More »

ప్రభుత్వ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా డా.వేమూరు రవికుమార్

-తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం -రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్‌టీ వారధిలా పని చేస్తుంది -ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం -మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు -ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్‌టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో …

Read More »

శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు, అభివృద్ధి

-ఏఐ సాయంతో జీరో క్రైమ్ రేట్ -వివేకా హంతకులను పట్టించింది టెక్నాలజీనే -ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపినిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేకా హత్య కేసే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేరాల కట్టడికి.. వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ …

Read More »

ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ హౌసింగ్, విద్యుత్ ,ఆర్డబ్ల్యూఎస్ ,పంచాయతీ రాజ్, కాంట్రాక్టర్లు ,ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గాల వారీగా లేఅవుట్ల వారీగా …

Read More »

పేద‌లంద‌రికీ స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన‌ ప‌క్కా ఇళ్లు క‌ట్టిస్తాం

-రాష్ట్ర స‌మాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి -విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల్లోని గృహ నిర్మాణ లేవుట్ల ప‌రిశీల‌న, ల‌బ్ధిదారుల‌తో మాటామంతి విశాఖ‌ప‌ట్ట‌ణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద‌లంద‌రికీ స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన ప‌క్కా ఇళ్లు క‌ట్టిస్తామ‌ని, ఎన్.టి.ఆర్. కాల‌నీల్లోని పెండింగ్ ప‌నుల‌ను అతి త్వ‌ర‌లోనే పూర్తి చేసి ఇళ్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి పేర్కొన్నారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ఆనంద‌పురం మండ‌లంలోని గిడిజాల‌, అన‌కాప‌ల్లి జిల్లా స‌బ్బ‌వ‌రం …

Read More »