Breaking News

Monthly Archives: July 2026

సీదిరి అప్పలరాజు కుటుంబంపై వేధింపులు ఆపాలి… : సైకం రాజశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుటుంబంపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఏపీ ఫిషరీస్ మెన్ జేఏసీ, అమరావతి చైర్మన్, హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ఆరోపించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైకం రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈనెల11న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అసలు నిందితుడైన సిద్ధార్థపై ఇప్పటికే ఎసఐఆర్ నమోదైందని, ఇరుపక్షాల అంగీకారంతో …

Read More »

ఈనెల 18న గొల్లపూడిలో శ్రీ జగన్నాథ రథయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. గురువారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మందిర అధ్యక్షులు హెచ్.జి. దయానిధి దాస్ వెల్లడించారు. ఈనెల 18వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి ప్రారంభమై, అయ్యప్పస్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. రథంపై జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. యాత్రలో …

Read More »

ఇస్కాన్ ఆధ్వర్యంలో*భక్తి పార్వశ్యాలతో కన్నుల విందుగా జరిగిన “శ్రీ జగన్నాథ రథయాత్ర”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్కాన్ విజయవాడ వారు “శ్రీ జగన్నాథ రథయాత్ర”ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవానిపురం సితార గ్రౌండ్స్ నుండి మధ్యాహ్నం 1 గంటకు పూజా కార్యక్రమం అనంతరం 3 గంటలకు రథయాత్ర వేలాది మంది భక్తులు మరియు కళాకారుల బృందాలతోనూ ఇతర రాష్ట్రాల మరియు దేశ విదేశీయ భక్తులతోనూ, స్వాతి థియేటర్ రోడ్డు, కనకదుర్గ గుడి రోడ్డు, రథం సెంటర్ మీదగా సీతమ్మ వారి పాదాలు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం వద్దకు చేరుకుంది. చిన్నారుల …

Read More »

మాది ఇన్వెస్టర్ల ఫ్రెండీ ప్రభుత్వం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ టెక్స్ -2026 ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మొదటి రోజు బిజీగా గడిపారు. పలువురు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఇన్వెస్టర్లకు ఫ్రెండీ ప్రభుత్వమని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామంటూ, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి …

Read More »

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు కేంద్రం అoడదండలు

-రాయలసీమకు శాశ్వత నీటి భద్రతకు ఇదే కీలకం: మంత్రి సత్యకుమార్ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి *సత్యకుమార్ యాదవ్* స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని, మిగిలిన పనులకూ అవసరమైన నిధులు సమకూర్చేందుకు కేంద్రం వెనుకాడబోదని చెప్పారు. బీజేపీ నేతలతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి.. లెఫ్ట్ …

Read More »

పోలవరానికి కేంద్రం అండదండలు

-ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిధుల కొరత లేదు -రాయలసీమకు శాశ్వత నీటి భద్రత.. -ఉత్తరాంధ్రకు తాగునీటి వరం: -మంత్రి సత్యకుమార్ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మలిచే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి వెనుకంజ ఉండదని తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి …

Read More »

రాష్ట్రంలో 12 కొవిడ్‌ కేసులు

-నాలుగు జిల్లాల్లో చెదురుముదురుగా నమోదు -పూణే ల్యాబ్ కు జన్యుక్రమ విశ్లేషణ నిమిత్తం 5 నమూనాలు -జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసుల నమోదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు చెదురుము దురుగా బయటపడ్డాయి జూన్‌ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 మంది కోవిడ్ వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో నలుగురు మృతి చెందారు. వీరికి అంతకుముందే తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ …

Read More »

RTC ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు – MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు RTC ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (RTC JAC) నాయకులు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, RTC ఉద్యోగ సంఘాల JAC ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు …

Read More »

అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో బోర్డ్ లు ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ నగరంలోని కృష్ణనగర్, కుందులరోడ్, నల్లపాడు, శ్యామల నగర్, విద్యా నగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి జిఎంసి ఖాళీ స్థలాలు, అభివృద్ధి పనులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత …

Read More »

బీసీ సంక్షేమ వసతి గృహాల మెస్ చార్జీలు 25 శాతం పెంచాలి…

-జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లలో) నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వర రావు డిమాండ్ చేసారు. గురువారం ధర్నా చౌక్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల అవసరాలు, మెస్ చార్జీలు, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »