Breaking News

Monthly Archives: July 2026

వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, వేముల శ్యామలాదేవి రోడ్, ఏలూరు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రత, వ్యర్థాల తరలింపు పరిశీలించారు. అనంతరం అజిత్ సింగ్ నగర్‌లోని …

Read More »

ఆగస్టు 17న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద రైతుల ఆందోళనలు

-అన్ని పంటలకూ ఉచిత బీమా వర్తింపజేయాలి! -వాతావరణ ఆధారిత బీమా గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలి! -ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని మరియు రైతుల వాటా బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నేడు …

Read More »

అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదు : కలెక్టర్ డీకే బాలాజి

-తాడిగడపలో 14 మంది ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష -నాట్ ట్రేసబుల్, అన్ కలెక్టబుల్, అనామలీస్ ఫారాలపై క్షుణ్ణ పరిశీలన -ఫారాలను జూలై 20 లేదా 21లోపు సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా పూర్తి చేసి, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, …

Read More »

ముంబయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్..త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్ష -శస్త్ర చికిత్స జరిగిన ఈ పరిస్థితుల్లోనూ ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ముంబయిలో పరామర్శించారు. ఇటీవల …

Read More »

బిజినెస్ రూల్స్‌లో సంస్కరణలు

-క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఫిర్యాదుల సమాచారం -ఫైళ్ల క్లియరెన్స్ పేరిట అభివృద్ధి ఆలస్యం కాకూడదు -అవకాశాలు అందిపుచ్చుకునేలా నిబంధనల్లో వెసులుబాటు -2017తో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20 శాతం వృద్ధి నమోదు -ఆర్టీజీఎస్ సమీక్షలో దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు …

Read More »

డేటా డ్రివెన్ గవర్నెన్స్‌తో రియల్ టైమ్ రిజల్ట్స్

-నెలవారీ ఆర్ధిక నివేదికలతో ఆశించిన పురోగతి -అర్జీల పరిష్కారం, క్షేత్ర స్థాయి పర్యటనలు తప్పనిసరి -ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి -మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని …

Read More »

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తో పాటు… గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు….ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం …

Read More »

నెలవారీ ఆర్థిక నివేదికతో దేశంలోనే సరికొత్త పరిపాలనా విధానానికి శ్రీకారం

-డేటా ఆధారిత సుపరిపాలన, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయం -రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని సరికొత్త పరిపాలనా విధానానికి నాంది పలికిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు …

Read More »

201 కుటుంబాల వందేళ్ల సమస్యకు పరిష్కారం

-పుల్లడిగుంట గ్రామ ప్రజలకు తీపి కబురు -నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు -శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కుంగుంది బాటలో పుల్లడిగుంట -మున్మందు మిగిలిన దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: మంత్రి అనగాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలికంగా నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని గ్రామాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. తాజాగా వందేళ్ల నుండి నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని పుల్లడిగుంట గ్రామ ప్రజలందరి సమస్యను తీర్చింది. ఈ గ్రామంలో ఉన్న 201 కుటుంబాలకు సంబంధించిన …

Read More »

ఆర్టీజీఎస్‌ను సంద‌ర్శించిన సింగ‌పూర్ బృందం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సింగ‌పూర్‌కు చెందిన ప్ర‌తినిధుల బృందం మంగ‌ళ‌వారం సంద‌ర్శించింది. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ క‌మండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ బృందం తిల‌కించింది. సింగ‌పూర్ ప్ర‌భుత్వ సాంకేతిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట‌న్ ఇంగ్ ఫెండ్ నేతృత్వంలో వ‌చ్చిన ఈ బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. ఆర్టీజీఎస్ ప‌నితీరును ఆ బృందానికి వివ‌రించారు. డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ ఆశ‌యాలు, డేటా లేక్‌, డేటా లెన్స్‌, త‌దిత‌ర కార్యక‌లాపాల గురించి ఆర్టీజీఎస్ …

Read More »