-ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 94 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే -ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర నివేదిక సేకరణ -గృహ సర్వే ద్వారా ఖచ్చితమైన క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు తగిన సమాచారం సేకరణ చేపడుతున్నాం -క్యాన్సర్ కేసుల సర్వే నేపధ్యంలో బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ -ప్రజల లో ఉన్న అపోహలు తొలగించడం కొరకు ప్రజల లో అవగాహన కల్పించి అనుమానిత కేసులు వెంటనే స్క్రీనింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి -హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ …
Read More »Monthly Archives: March 2025
తూర్పు గోదావరి జిల్లా లో క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతోంది….
-ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. -డాక్టర్ ఎన్ .వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో క్షయ వ్యాధి లక్ష్యాలు ను ఆదిగమించడం తో పాటు వ్యాధి గ్రస్తులను ముందగా గుర్తుంచి త్వరితగతిని చికిత్స అందించడం వలన క్షయ వ్యాధి క్రమేపి తగ్గు ముఖం పడుతోందని త జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎన్. వసుంధర ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా లో ప్రస్తుతం 2864 మంది సాధారణ క్షయ వ్యాధి …
Read More »పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకొంటాం , అత్యవసర సేవలను నిలిపివేయడం జరుగుతుంది
-పన్నులు చెల్లించి మౌలిక సదుపాయాల కల్పన కు, సక్రమ నిర్వహణకు సహకరించండి -ఆస్తిపన్ను బకాయిలు రూ.10 కోట్లు, నీటి చార్జీల బకాయిలు రూ.2 కోట్లు -నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన పన్నులు, పన్నేతరములను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని మునిసిపల్ కమిషనరు కేతన్ గార్గ్ కోరారు. ఆదివారం ఉదయం ఆర్ ఎమ్ సి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »ఉల్లాస్ అసెస్మెంట్ టెస్ట్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉల్లాస్ అసెస్మెంట్ టెస్ట్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 23వ తేదీ ఆదివారం జరిగింది. ఈ పరీక్షకు 12,085 మంది సెల్ఫ్ నిరక్షరాస్య మహిళలు హాజరయ్యారు. ప్రాథమిక అక్షరాస్యత, డిజిటల్ లెర్నింగ్, మరియు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ పొందిన 11,978 మంది మహిళలు ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ రాశారు. ఉత్తీర్ణత సాధించిన మహిళలకు NIOS (National Institute of Open Schooling) ద్వారా ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. స్టేట్ …
Read More »పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ఏడాదిన్నర లోగా పూర్తిచేస్తాం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రూ.7 కోట్లతో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఏరియా ఆస్పత్రిని సీనియర్ నాయకులు, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తో కలసి ప్రారంభించాను. ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన వార్డులు, గదులను పరిశీలించాను. హాస్పిటల్ లో అత్యాధునిక డయాగ్నసిస్ పరికరాలు సమకూర్చడంలో కృషిచేసిన కన్నా లక్ష్మీ నారాయణ గారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ …
Read More »27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్
-రాష్ట్రంలో జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు -ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే హర్షవర్ధన్ ఉత్తరులు జారీ చేశారు.ముస్లిం మైనార్టీల కు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీన …
Read More »“CISF కోస్టల్ సైక్లోథాన్”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “CISF కోస్టల్ సైక్లోథాన్” కావలి ( నెల్లూరు జిల్లా) నుండి 1800 గంటలకు నాయుడుపేట వాసమ్మ ఆశ్రమం (తిరుపతి జిల్లా)కి ఆదివారం చేరుకుంది మరియు సైక్లిస్టులకు స్థానిక ప్రముఖులు, పాఠశాల పిల్లలు మరియు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. సైక్లోథాన్ ఇప్పటికే బక్కలి (పశ్చిమ బెంగాల్) నుండి నాయుడుపేట (ఆంధ్రప్రదేశ్) వరకు 1877 కిలోమీటర్ల సవాలుతో కూడిన ప్రయాణాన్ని పూర్తి చేసింది, ఇది ఇప్పటివరకు భారతదేశ విస్తారమైన తీరప్రాంతాన్ని కవర్ చేసిన …
Read More »గ్రామ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ కృషి
-రేపూడి గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం ఏకొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని 295 గ్రామాలను వికసిత్ పంచాయతీ కార్యక్రమంలో సమగ్ర గ్రామీణాభివృద్ది చేసి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి చేస్తున్నారని జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ తెలపారు. ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్త అయ్యేందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందిస్తున్న సహకారం అందుకోవాలని కోరారు. తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు …
Read More »ఈ నెల 24వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …
Read More »ఎంఎస్‌ఎంఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ కార్యక్రమ అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి .సాంబయ్య పరిశ్రమల ఉద్యమం రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్‌కు హాజరు కావాలని కోరారు. ఈ వర్క్‌షాప్‌ను ఆటో నగర్, విజయవాడలోని ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్ హాల్, ఫైర్ స్టేషన్ ప్రక్కన 24-03-2025న ఉదయము 10 గ11 లకు నిర్వహించబోతున్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఉద్యమం రిజిస్ట్రేషన్‌ను ఎలా నమోదు చేయాలి, ఉద్యమం రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ఏమిటి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి ఏ ప్రయోజనాలు లభిస్తాయి, కొత్త యూనిట్‌ను ఎలా స్థాపించాలి …
Read More »
Prajavartha Online Telugu News