గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. తొలుత మత పెద్దలు దువా (ప్రార్ధన) నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రతి ఒక్కర కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నామన్నారు. రంజాన్ మాసంలో నగరంలోని ప్రతి మసీదు వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, త్రాగునీటి సదుపాయం, వీధి దీపాల ఏర్పాటు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా కాలం అనంతరం జిఎంసి ఆధ్వర్యంలో ఇఫ్తార్ …
Read More »Monthly Archives: March 2025
జిఎంసి ఇంచార్జి మేయర్ గా భాధ్యతలు తీసుకున్న షేక్ సజిలా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ మేయర్ షేక్ సజిలాను నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు ఇంచార్జి మేయర్ గా భాద్యతలు తీసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ జరిగింది. సదరు ఉత్తర్వుల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎంఎల్ఏలు నసీర్ అహ్మద్, గల్లా …
Read More »వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయకుండా సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఉధృతంగా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టామని, నగర ప్రజలు, వ్యాపార సంస్థలు కూడా వ్యర్ధాలను రోడ్ల పక్కన, డ్రైన్లలో వేయకుండా సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం కేటాయించిన కార్మికులు, వాహనాలను కమిషనర్ పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా భవన నిర్మాణ వ్యర్ధాలు, చెట్ల కొమ్మలు …
Read More »రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది
-ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర వలందపాలెం/మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగరం 3వ డివిజన్ వలందపాలెంలోని జామియా మసీదులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు …
Read More »గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభిస్తామని గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత వారు గిలకలదిండిలోని మత్స్యశాఖ షోరు కమ్యూనికేషన్ స్టేషనులో ఫిషింగ్ హార్బర్ రేఖ చిత్రపటాన్ని, తదుపరి నిర్మాణంలో ఉన్న ఫిష్ హ్యాండ్లింగ్, ఆక్షన్ …
Read More »భారతీయ సైన్యంలో చేరండి – అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025-26
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డి. కే. బాలాజీ తెలిపారు, భారతీయ సైన్యం అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 రిక్రూట్మెంట్ సంవత్సరానికి సంబంధించి కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (CEE) కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పరవతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, NTR …
Read More »బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. బందరు స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం నగర పరిధిలోని పాత రైల్వే స్టేషన్ నుంచి బందరుకోటకి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఇతర కూటమి నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా …
Read More »దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం- సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో (సిఐఎస్ఎఫ్) సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ అదనపు పోలీసు అధికారి సత్యనారాయణ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. అంతకుమునుపు ర్యాలీలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని …
Read More »బెంజిసర్కిల్‌లో చలివేంద్రం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని బెంజిసర్కిల్‌లో చలివేంద్రం ఏర్పాటుచేశారు. శుక్రవారం బెంజిసర్కిల్‌లోని ఉమ్మడి ఏపీ మాజీ కేబినెట్ మంత్రి మరియు జై ఆంధ్ర ఉద్యమ వ్యవస్థాపకుడు దివంగత నేత కాకాని వెంకటరత్నం విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత కెఏఎస్ఎస్ కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని, బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా …
Read More »పన్ను చెల్లించుటకు 6 క్యాష్ కౌంటర్లను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సౌకర్యార్థం వివిధ రకాల పన్నులు చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లలో ఆరు క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూడు సర్కిల్ కార్యాలయాలలో గల ఆరు క్యాష్ కౌంటర్లలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 …
Read More »
Prajavartha Online Telugu News