Breaking News

Monthly Archives: March 2025

అన్న క్యాంటీన్లలో ప్రజల అభిప్రాయాలు తీసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లో ప్రజల అభిప్రాయాలు కచ్చితంగా తీసుకోవాలని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం గాంధీజి మహిళ కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజి మహిళా కళాశాలలో గల అన్న క్యాంటీన్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియను పరిశీలించారు, నగర పరిధిలోగల అన్న క్యాంటీన్లలో నోడల్ ఆఫీసర్లు ప్రజల అభిప్రాయాలను తీసుకొని దానికి …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవల ప్రజల సహకారంతోనే సాధ్యం… : రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

-సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో జరగాలి- ధ్యానచంద్ర, నగర కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవల ప్రజల సహకారంతోనే సాధ్యం అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ మేయర్, రాయన భాగ్యలక్ష్మి. శనివారం ఉదయం వన్ టౌన్, పంజా సెంటర్ నందు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే జరుగుతుందని, ఇప్పటి …

Read More »

కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి …

Read More »

నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్

– సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు – కమీషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని మార్చి 15 న చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మార్చి 15 వ తేది ఉదయం 9.30 గంటలకి కంబాల చెరువు నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ స్వచ్ఛంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్నట్లు …

Read More »

ఇసుక కార్యకలాపాలు తనిఖీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల డిసిల్టేషన్ రీచు కోటిలింగాల ఇసుక ర్యాంపు 11.900 కిమీ “అఖండ గోదావరి లెఫ్ట్ బ్యాంకు” (AGLB) వద్ద ఇసుక కార్యకలాపాలు జరుగుచున్న ప్రదేశం సంయుక్తంగా తనిఖీ చేసి నూతన ఇసుక విధానం 2024 ప్రకారం జలవనరుల శాఖ వారు అనుమతించిన బోట్స్ మెన్ సొసైటీలు …

Read More »

“ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి”

-” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ సాధనలో  మార్చి నెల థీమ్ ”  కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మార్చి 15 వ తేది స్వచ్ఛ ఆంధ్ర సూచికల కింద పరిశుభ్రత మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర- ” “S.A.S.A” కార్యక్రమం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. 2025 సంవత్సరం లో ప్రతి నెలా …

Read More »

రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందచేసిన రూ.1,80,000 లకి అదనంగా మరో యాభై వేలు ఆర్ధిక సహాయం విడుదల చెయడం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా …

Read More »

వెదురు సాగుపై శిక్షణా కార్యక్రమము 

– హాజరుకానున్న 15 మంది ఉద్యానవన అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు – ఆసక్తీ కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఉద్యానవన అధికారి సుజాత కుమారి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల పొలాలలో వెదురు సాగు విస్తీర్ణంను పోత్సహించుటకు రాష్ట్ర స్థాయీ ఒకరోజు శిక్షణా కార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలోని జి ఎస్ ఎల్ హాస్పిటల్ ఆడిటోరియంలో మార్చి 15 వ తేది …

Read More »

శ్రీ అభయ హస్త సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అభయ హస్త సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా యన్.టి.ఆర్.జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్  పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు..అనంతరం అభయ హస్త అయ్యప్పస్వామి వారి జన్మదిన వేడుకలలో అవినాష్  పాల్గొని పూజలు నిర్వహించి ఆ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు ,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..

Read More »

విద్యారంగ – ఆర్థిక సమస్యలపై రాష్ట్ర సదస్సు – యుటియఫ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యారంగ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం పాఠశాల విద్యలో తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలతో బాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పిఆర్సి చైర్మన్ నియామకం, ఆర్థిక బకాయిల చెల్లింపు తదితర అంశాలపై మార్చి 16న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడలో యుటియఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. ఈ రోజు (14.03.2025) యుటియఫ్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో విద్యారంగ – ఆర్థిక సమస్యలపై …

Read More »