-కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఘనంగా వేడుక -గురువారం రాత్రి న్యూఢిల్లీ నుండి వియత్నాం ప్రదర్శనకు బుద్ధ భగవానుని అవశేషాలు తరలింపు కార్యక్రమం -తమ పవిత్ర ప్రయాణం వియత్నాం చేరుకుందని, ఆ గౌరవం పొందినందుకు గర్వంగా ఉందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం, వియత్నాం దేశాల మధ్య అధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ …
Read More »Daily Archives: May 2, 2025
పిజిఆర్ఎస్ రీ ఓపెన్ అర్జిల పరిష్కార విషయమై విచారణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార మార్గంలో తిరిగి (రీ ఓపెన్) వొచ్చిన అర్జీలు పరిష్కారం కోసం సంబంధిత అధికారీ , ఫిర్యాదు దారుల ఇరువురి సమక్షంలో 51 అర్జిల విషయంలో విచారణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పిజిఆర్ఎస్ రీ ఓపెన్ అర్జిల పరిష్కార విషయమై విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఈ రోజు …
Read More »నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉపాధి అవకాశాలు
-ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు దరఖాస్తు చేసుకునేందుకు -జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉద్యోగా అవకాశాలు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంలో ప్లేస్మెంట్ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. పేర్లు నమోదు కోసం మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియ …
Read More »ఆర్థిక అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధిదారులను గుర్తించాలి
-మత్స్యకారులకు ఆర్థిక చేయూత లబ్ధి దారుల గుర్తింపు కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి చేయూత నివ్వడం కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. జిల్లా కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో పీఎం మత్స్య సంపద యోజన పథకం, ఇతర పథకాలు అమలు …
Read More »ఘనంగా వియత్నాం 50వ వార్షికోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నాం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో సిపిఐ ప్రతినిధిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పాల్గొన్నారు. హోచిమిన్ సిటీలో ఘనంగా జరిగిన వియత్నాం వేడుకల్లో పాల్గొన్న కె రామకృష్ణ వివిధ దేశాల కమ్యూనిస్టు నాయకులతో, వామపక్ష నాయకులతో భేటీ అయ్యారు. పలు దేశాల నుండి సుమారు 13,000 మంది ప్రతినిధులుగా పాల్గొన్న ఈ వేడుకల్లో శాంతి, ఐక్యత, జాతీయ అభివృద్ధి అంశాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయి. ప్రతినిధులలో విదేశీ …
Read More »పగబట్టారు పాలన మరిచారు… : తిరుపతి ఎంపీ గురుమూర్తి
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆస్తుల ధ్వంసానికి కూటమి ప్రభుత్వం కుయుక్తులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామ సర్పంచ్ చెలికం నాగరాజు రెడ్డికి చెందిన సుమారు రూ.10 లక్షల విలువైన టేకు దుంగలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తగలబెట్టిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఇనగలూరు గ్రామానికి చేరుకుని సంఘటన జరిగిన …
Read More »అనుబంద విభాగాల కమిటీలు త్వరగా పూర్తి చేయండి… : భూమన కరుణాకర రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, క్లస్టర్ అధ్యక్షులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూమన మాట్లాడుతూ త్వరితగతిన అనుబంధ విభాగ కమిటీలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వారికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కలసికట్టుగా పని చేస్తూ, ఇబ్బందులను …
Read More »
Prajavartha Online Telugu News