-లక్ష్యాల సాదనలో వెనుకబడితే చర్యలు తప్పవు.. -ఉపాధి హామిలో ఉద్యాన పంటల పనులకు ప్రాధాన్యతనివ్వండి.. -శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని, పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు 307 రూపాయల కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి …
Read More »Daily Archives: May 14, 2025
ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి…
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలపాలని సిపిఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, …
Read More »నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించాలని చీఫ్ సిటీ ప్లానర్స్ సంజయ్ రత్నకుమార్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అదేశాల మేరకు బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ పట్టణ ప్రణాళిక సిబ్బంది, ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ ప్లానింగ్ సెక్రెటరీ దగ్గర నుండి అసిస్టెంట్ సిటీ ప్లానర్ …
Read More »నగరాన్ని గుంతలు లేని నగరంగా ఉంచాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మిల్క్ కాలనీ క్రాంబే రోడ్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ పైన గుంతలను ఎప్పటికప్పుడు సచివాలయం సిబ్బంది తమతమ సచివాలయం పరిధిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటూ రోడ్ల పైన ఎటువంటి గుంతలు లేకుండా చూసుకోవాలని …
Read More »వీధి వ్యాపారస్తుల సర్వే ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాజాగా జరిగిన స్ట్రీట్ వెడ్డింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా వీధి వ్యాపారస్తుల సర్వేను మంగళవారం నుండి నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 సర్వే ప్రకారం 17,282 వీధి వ్యాపారస్తుల ఉన్నారని, 2025 వారిలో ఇంకా ఎంతమంది వీధి వ్యాపారస్తులుగా ఉంటున్నారు, వారు కాకుండా ఇంకా కొత్తవారు ఎవరైనా విధుల్లో వ్యాపారం చేస్తున్నారా వంటి అంశాలను 286 సచివాలయాల పరిధిలో ఉన్న 286 …
Read More »
Prajavartha Online Telugu News