Breaking News

Daily Archives: May 17, 2025

అనధికార విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని రోడ్లపై అనధికారికంగా నాటు కోళ్లు, చేపల, మాంస విక్రయాలు చేయడానికి వీలులేదని, డివిజన్ల వారీగా అనధికార విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లపై అనధికారిక నాటుకోళ్లు, చేపలు, మాంస విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార విక్రయాలు చేసే వారికి భారీ …

Read More »

పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడం ద్వారా, దాని ద్వారా ఏర్పడే వేడి వాతావరణంను తగ్గించుకోవచ్చని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచాంద్ర లో భాగంగా శనివారం బొంగారాల బీడు హిందూ శ్మశాన వాటిక దగ్గర ఐ.టి.సి ఫినిష్ సంస్థ సౌజన్యంతో మెట్టు అంజిరెడ్డి అందించిన గుడ్డ సంచులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తో కలిసి ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాదాన్యతనిస్తుందన్నారు. ప్రతి …

Read More »

త్రాగునీటి సమస్య రాకుండా ప్రాణాళికాబద్దమైన ప్రాజెక్ట్లను పూర్తి చేస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి రాబోవు 20 ఏళ్లవరకు త్రాగునీటి సమస్య రాకుండా ప్రాణాళికాబద్దమైన ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని, కేంద్ర గ్రామీనాభివ్రుద్ది మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. శనివారం గుంటూరు నగర పాలక సంస్థ సమావేశం మందిరంలో అమృత్ 2.0 లో నగరానికి మంజూరైన 362.23 కోట్ల నిధులు గూర్చి వివరించి, శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మాణానికి సహకరించిన భవన యజమానులకు చెక్కుల పంపిణీలను మేయర్ కోవెల మూడి రవీంద్ర, కమిషనర్ పులి …

Read More »

నగరంలోని శ్మశాన వాటికలను మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహాప్రస్థాన సేవా సమితి స్పూర్తితో గుంటూరు నగరంలోని శ్మశాన వాటికలను మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం బొంగరాలబీడులోని నగర పాలక సంస్థ హిందూ స్మశానవాటికలో నూతనంగా నిర్మించిన గ్యాస్ ఆధారిత దహనవాటికను, ఫ్రీజర్ రూమ్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ మరియు మహాప్రస్తానం సేవా సమితి సభ్యులతో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మహాప్రస్థాన సేవా సమితి రాష్ట్రంలోనే తొలిసారి స్తంబాలగరువు …

Read More »

నగరంలో లాబ్-గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ లాడియ ప్రారంభం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందర్ రోడ్ లోని పివిఆర్ స్టోర్ నందు భారతదేశంలోనే అతిపెద్ద లాబ్-గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియ తన నాల్గవ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందనీ,ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆభరణాలను తమకు కావాల్సిన డిజైన్ లో చేయించుకుంటున్నారనీ అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందనీ, కొనుగోలు దారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియ స్టోర్స్ …

Read More »

పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం ఏలూరు వారి ఆధ్వర్యంలో ఏలూరు నెహ్రూ యువ కేంద్రం ఆఫీసులో యువజన అధికారి సుంకర రాము  ఆధ్వర్యంలో మై భారత్ లో భాగంగా సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ మరియు ఆపదమిత్ర రిజిస్ట్రేషన్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఆయన మాట్లాడుతూ యువతను మై భరత్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని, తెలిపారు. మై భారత్లో భాగం చేయాలనీ మై భారత్ డిఫెన్స్ …

Read More »

సిరి సీడ్స్ కంపెనీ ఇచ్చిన నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించాలి…

-ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.జమలయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిరి సీడ్స్ కంపెనీ ఆర్గనైజర్ మన్మధరావు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయిన మొక్కజొన్న విత్తన కౌలురైతులకు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఊరు పేరు లేని విత్తన కంపెనీలు సీడ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకొని మైలవరం ఏరియాలో వందలాది ఎకరాల్లో నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి రైతాంగాన్ని మోసగిస్తున్న విత్తన కంపెనీలపై చట్టపరమైన చర్యలు …

Read More »

సేంద్రియ ఎరువుల గుంత‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి

– వారం రోజుల్లో టైప్‌-1, టైప్‌-2 గుంత‌ల ప‌నులు ప్రారంభించండి – జిల్లాలో తొలివిడ‌త 17 వేల గుంత‌ల నిర్మాణం పూర్తికావాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్యం స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు, మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దోహ‌దం చేసే సేంద్రియ ఎరువుల గుంత‌ల(కంపోస్ట్ పిట్‌)పై పెద్దఎత్తున ప్ర‌జ‌ల‌కు అవ‌గాహన క‌ల్పించాల‌ని, జిల్లాలో తొలివిడ‌త ల‌క్ష్య‌మైన 17 వేల గుంత‌ల‌కు అంచ‌నాలు రూపొందించి, వారం రోజుల్లో ప‌నులు ప్రారంభ‌మ‌య్యేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ …

Read More »

యోగా, ధ్యానం, మానసిక ప్రశాంతతకు దోహదాం…

-మానసిక ప్రశాంతతో రక్తపోటును అధిగమిద్దాం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానం ద్వారా ఒత్తిడినిక తట్టుకుని రక్తపోటుని నివారించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రక్తపోటు శిభిరాన్ని కలెక్టర్‌ లక్ష్మీశ ప్రారంభించి రక్తపోటు పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు, ఆహార అలవాట్లు నియంత్రణ, …

Read More »

స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేద్దాం

– అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛ‌తా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలి – డీఎఫ్ఎస్‌వో ఎ.ర‌వీంద్ర‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది విధిగా స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని.. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయ‌డం ద్వారా స్వ‌ర్ణాంధ్ర @ 2047లోని స్వ‌చ్ఛాంధ్ర ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లుగుతామ‌ని జిల్లా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి ఎ.ర‌వీంద్ర‌రావు అన్నారు. స్వ‌చ్ఛాంధ్ర‌-స్వర్ణాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం రాష్ట్ర ప్ర‌భుత్వ అతిథి గృహం ఆవ‌ర‌ణ‌లో గ‌ల జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మంలో …

Read More »