-రికార్డ్ స్థాయిలో పనులు పూర్తి-మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడాది విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరదకు సంబంధించి బుడమేరు గట్టుకు ఏర్పడ్డ మూడు గండ్లను కలుపుతూ 365 మీటర్ల పొడవున చేపట్టిన సీసీ వాల్ నిర్మాణం పూర్తయినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం ఈ పనుల పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడారు. సీసీ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులకు ఏప్రిల్ నెలలో ఆర్థిక ఆమోదం లభించగా మే నెలలో టెండర్లు …
Read More »Monthly Archives: June 2025
విజయవంతంగా మెగా DSC–2025 నియామక పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇరవై ఒకటవరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 43పరీక్షా కేంద్రాలలోఒక్కటేసెషన్లలో నిర్వహించబడిన SA(L)–TELUGUమెగా DSC–2025 నియామక పరీక్ష విజయవంతంగా జరిగినది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన 6884 అభ్యర్ధులకు గాను 6442(93.58%)మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరైయ్యారు. జిల్లా వారీగా పరిశీలిస్తే, గుంటూరు జిల్లాలో (100%) అత్యధికంగా అభ్యర్ధులు పరీక్షకు హాజరైయ్యారు అని మెగా DSC–2025 కన్వీనర్ ఎం.వి.క్రిష్ణా రెడ్డి తెలియ చేశారు.
Read More »చివరి ఆకు వరకు పొగాకు కొనుగోళ్లు
-దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లు -సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతి -మ్యాంగో, వరి, కోకో, మిర్చి రైతులకు కూటమి బాసట -బాపట్ల జిల్లాలో మరో మూడు పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల వద్ద నుంచి చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో జె.పంగులూరు, పర్చూరు, ఇంకొల్లులలో సోమవారం …
Read More »మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వాలి…
– ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా మన దేశం అభివృద్ధి సాధిస్తోంది – ఇండ్లాస్ హాస్పిటల్స్ ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సుల ప్రారంభం కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి – ప్రతి లక్ష మంది జనాభాకు ముగ్గురు మానసిక వైద్యులు అవసరం – సినిమాల్లో మానసిక వైద్యులను చులకన చేయడం మానుకోవాలి – విశాఖలో మెంటల్ హెల్త్ ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తాం – డాక్టర్ ఇండ్ల రాముసుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎక్సెలెన్స్ సెంటర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం – ఇండ్లాస్ హాస్పిటల్స్ …
Read More »నిర్ధిష్ట లక్ష్యాలతో పనిచేస్తేనే స్వర్ణాంధ్ర సాధ్యం
-గాలివాటంగా నడుచుకుంటే ప్రగతి సాధించలేమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -ప్రజారోగ్య పరిరక్షణ దిశగా ప్రతి ఏడాదీ ఒక అడుగు ముందుకు పడాలి -2025-26 ఎజెండాపై ఉన్నతాధికారులతో మూడు గంటల విస్తృత చర్చలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ప్రజారోగ్య రంగంలో ఎదురైన అనుభవాలు, మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు, సాధించిన ఫలితాల నేపథ్యంలో 2025-26 కు సంబంధించిన ఎజెండాపై వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సోమవారం సాయంత్రం మూడు గంటల పాటు వెలగపూడి …
Read More »ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
-2024 జులైలో భారీ వర్షాల వల్ల 3,071.41 హెక్టార్లలో పంట నష్టపోయిన రైతాంగం -ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపుకు దీర్ఘకాలిక ప్రణాళిక.. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడి -మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంపై నియోజకవర్గ రైతాంగం హర్షం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి …
Read More »“ఆహా ఏమి రుచి”.. పాఠశాల మధ్యాహ్న భోజనం పై కలెక్టర్ ప్రశంస
-విద్యార్థులతో కలిసి సహపంతి భోజనం చేసిన కలెక్టర్, జేసి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తాళ్లపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహ పంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని ప్రశంసించారు. “ప్రతిరోజు ఇలాగే ఉంటుందా” అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరుపై కలెక్టర్ పి ప్రశాంతి సంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల వ్యవధిలోగా స్పష్టంగా స్థానిక భాష మరియు ఇంగ్లీషులో రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించాలి
-సూచనలు పాటించకపోతే AP APMCE Act – 2002 మరియు రూల్స్ 2007 ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి -డా కె. వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం, విజయవాడ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తమ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల వ్యవధిలోగా స్పష్టంగా స్థానిక భాష మరియు ఇంగ్లీషులో రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించాల్సినది.అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »మీకోసం అర్జీల సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలనుండి అందే మీకోసం అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) మీ కోసం కార్యక్రమాన్ని సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, అదనపు ఎస్పీ సత్యనారాయణ, మెప్మా పీడీ సాయిబాబు,విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు లతో కలిసి …
Read More »సిఎస్ఆర్ నిధుల మంజూరుకు అంచనాలు తయారు చేయాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులు మంజూరుకు అంచనాలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) డాక్టర్ ఎన్ నరేష్ తో కలసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో (సిఎస్ఆర్) నిధులు మంజూరుపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో …
Read More »
Prajavartha Online Telugu News