గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ బర్త్ అండ్ డెత్ విభాగం వద్ద పిజిఆర్ఎస్ ని అదనపు కమిషనర్ నిర్వహించారు. …
Read More »Monthly Archives: June 2025
రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి… : పి.జమలయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు నెలల కాలం నుండి రైతులకు చెల్లించ కుండా పేరుకుపోయిన రబీ ధాన్యం బకాయిలు సుమారు వెయ్యి కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి 46 వేల మంది రైతుల ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చి ప్రారంభంలో మురిపించారన్నారు. ఆ తర్వాత మే 10వ …
Read More »బేవరేజెస్ కార్పొరేషన్ డీజీఎం కృష్ణ ప్రసాద్ పదవీ విరమణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం- పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) అడుసుమిల్లి వెంకట కృష్ణప్రసాద్ సోమవారం పదవీ విరమణ చేశారు. మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వెంకట కృష్ణప్రసాద్‌కు డైరెక్టర్ – ఎన్‌ఫోర్స్‌మెంట్ రాహుల్ దేవ్ వర్మ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. 1989లో ప్లాంట్ సూపర్వైజర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, అనంతరం అసిస్టెంట్ మేనేజర్ పదోన్నతి పొంది 2018లో …
Read More »జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 134 అర్జీలు
-నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 134 అర్జీలు వచ్చాయని.. వీటిని క్షుణ్నంగా పరిశీలించి గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పోలీసు శాఖకు సంబంధించి 36, రెవెన్యూ శాఖకు సంబంధించి 35, విద్యా శాఖకు 12, …
Read More »స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, పెంచిన విద్యుత్ చార్జీలపై ఉద్యమం
-జూలై 9న సార్వత్రిక సమ్మెకు సంఫీుభావం -జూలై 2న కరేడుకు వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం -వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి. ప్రసాద్ అధ్యక్షతన సోమవారం విజయవాడ దాసరిభవన్‌లో జరిగింది. సమావేశానికి సిపిఐ నుండి కె.రామకృష్ణ, జల్లి విల్సన్(మాజీ ఎమ్మెల్సీ), అక్కినేని వనజÑ సిపిఐ(ఎం) నుండి వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావుÑ సిపిఐ(ఎంఎల్) నుండి జాస్తి కిషోర్‌బాబుÑ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పివి సుందరరామరాజుÑ ఎంసీపీఐ(యూ) …
Read More »పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్, విఎంసి అధికారులతో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కాంట్రాక్టర్లు అందరూ సహకరించాలని త్వరితగతిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపం …
Read More »ప్రతి ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 13 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు …
Read More »అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్మింగ్ పూల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్, ధర్నాచౌక్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ శ్రేయస్థాయి స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్వహించాలని, స్విమ్మింగ్ పూల్ లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, షవర్, జిమ్, మరుగుదొడ్ల …
Read More »మనం చేసిన మంచిని చెప్పండి… వైసీపీ కుట్రలను వివరించండి
-నిజం గడప దాటేలోగా… అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది… అప్రమత్తంగా ఉండండి -ప్రజలకు అందుబాటులో ఉంటే ఆదరిస్తారు… లేకుంటే టాటా చెప్పేస్తారు -ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడతా… మంచి చెడులు వివరిస్తా -ప్రజలకు జవాబుదారీగా ఉందాం… పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం -ప్రభుత్వ కొనసాగింపుతోనే అభివృద్ధి… కళ్ల ముందున్న వాస్తమిది -కార్యకర్తలను మరువొద్దు -టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం -నెల రోజుల పాటు ప్రజల్లో ఉండాలని నేతలకు ఆదేశం …
Read More »కూటమి పాలనలో ఇంటింటికి సంక్షేమం వైసీపీ పాలన లో ఇంటింటికి మోసం : ఎంపీ కేశినేని శివనాథ్
-షా జహూర్ ముసాఫిర్ ఖానా లో టిడిపి పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం -టిడిపి నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం -విజయవాడ నగరవాసులకు వరం జి.వో నెంబర్ 30 -‘సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం విజయవంతం చేయాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏడాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇంటింటికి సంక్షేమం అందితే, వైసిపి పాలనలో ఇంటింటికి మోసం జరిగింది. ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం అందించటంతో పాటు రాష్ట్రాభివృద్ది కూడా జరుగుతుందని విజయవాడ ఎంపీ …
Read More »
Prajavartha Online Telugu News