Breaking News

Monthly Archives: June 2025

ఆంధ్రప్రదేశ్‌ మామిడి రైతులను ఆదుకోవాలి..

-కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. లేఖలో ఎంపీ పేర్కొన్న వివరాల ప్రకారం, దేశంలోనే అత్యధికంగా 12.35 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. ఇది దేశ మామిడి సాగు …

Read More »

హెచ్‌.సి.జి. క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో సీమెన్స్ బయోగ్రాఫ్ పెట్‌- సిటీ స్కాన్

-హెచ్‌.సి.జి. క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో క్యాన్స‌ర్ నిర్థార‌ణ, నివార‌ణకు అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావ‌డం అభినంద‌నీయం -MLA బొండా ఉమ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : గుణ‌ద‌ల‌లోని హెచ్‌.సి.జి. క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో శనివారం అధునాత‌న “పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ మరియు కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కానింగ్ మెషిన్‌” (సీమెన్స్ బయోగ్రాఫ్ పెట్‌- సిటీ స్కాన్) యంత్రాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామ‌హ‌శ్వ‌ర‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రై లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ గ‌త వైసిపి ప్ర‌భుత్వంలో …

Read More »

సింగపూర్ లో ఘనంగా నందమూరి తారక రామారావు 102వ జయంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు జూన్ 28న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వెంకటగిరి MLA కురుగొండ్ల రామకృష్ణ , విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు వెంపటి మాధవనాయుడు హాజరై ప్రసంగించారు. అప్పలనాయుడు మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి అన్, ఆయన బాటలోనే బాబు, లోకేష్ ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు, రామకృష్ణ …

Read More »

‘మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు

-ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు -ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు -ఇకపై ఆర్టీసీలో ప్రవేశ పెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే -అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

అంటువ్యాధులు ప్రబలకూడదు… స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం

-డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలు పెంచాలి -ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ఫోకస్ పెట్టండి -పౌల్ట్రీ వేస్ట్ పాలసీని తీసుకురండి -లెగసీ వేస్ట్ కన్పించకూడదు -మున్సిపల్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ శాఖపై చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ శాఖ పనితీరు, మున్సిపల్ శాఖ పరిధిలో చేపడుతున్న …

Read More »

అమృత్ స్కీమ్ ద్వారా తాగు నీరు పైప్ లైన్ పనుల కోసం టెండర్లు పిలిచాం

-AIIB నుంచి 5350 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం -రాష్ట్రంలో వంద‌శాతం ఇళ్ల‌కు ర‌క్షిత తాగునీరు అందించేందుకు చ‌ర్య‌లు -టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం -అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన …

Read More »

జూలై మూడో తేదీన కేంద్రమంత్రి రాందాస్ అథాలే జిల్లా రాక

-భారత ప్రభుత్వ సంస్థ అలింకో(Alimco) జిల్లా వ్యాప్తంగా జూలై మూడవ తేదీన విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ :జిల్లా రెవెన్యూ అధికారి చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వ సంస్థ అలింకో(Alimco) సహకారంతో జిల్లా వ్యాప్తంగా జూలై మూడవ తేదీన విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ కేంద్ర మంత్రివర్యులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ముందస్తు ఏర్పాటలో భాగంగా శనివారం జిల్లా సచివాలయం నందు గల డిఆర్ఓ ఛాంబర్ …

Read More »

తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ రివర్స్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశంలో 101 అవగాహన ఒప్పందాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC) భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ రివర్స్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశం (RBSM) జూన్ 28, 2025న తిరుపతిలో విజయవంతంగా ముగిసింది. తిరుపతి మరియు చుట్టుపక్కల జిల్లాల నుండి 350 కి పైగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME లు) యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, GCC దేశాలు, ఆఫ్రికా మరియు ఆగ్నేయాసియాతో సహా దేశాల నుండి 30 …

Read More »

దేశ సమస్యలకు శాస్త్ర పరిశోధనలు పరిష్కారం చూపాలి

-పరిశ్రమలు పరిశోధనపై దృష్టి సారించాలి -ఆవిష్కరణలు, పరిశోధన ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం -మన ఆలోచనలు భేష్.. కానీ ఉత్పత్తుల్లో వెనుకబడ్డం (ఐడియా రిచ్.. ప్రోడక్ట్ పూర్) -నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత మిస్సైల్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వి. కె. సారస్వత్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశం ఎదుర్కొంటున్న పోషకాహార లోపం, శిశు మరణాలు, మాతృ మరణాలు వంటి సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమని, మన శాస్త్ర పరిశోధనలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని నీతి …

Read More »

అమ్మవారికి ఆషాడమాసం సారే సమర్పించిన దశావతార అమ్మవారి భక్త బృందం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడమాసం సారెను చిట్టినగర్ శ్రీ నగరాల కొత్త అమ్మవారి దేవస్థానం నుండి వందమంది దశావతార అమ్మవారి భక్త బృందం ఊరేగింపుగా మేళతాళాలతో డప్పులతో భక్తి శ్రద్ధలతో బయలుదేరి ఆంజనేయ వాగు నేరుబొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి కనకదుర్గ నగర్ మీదుగా వెళ్లి అమ్మవారికి సారే సమర్పించారు.  అమ్మవారికి పట్టు చీర పసుపు కుంకం 21 రకాల సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పోతిన విజయలక్ష్మి, పిళ్ళా మాధవి, పోతిన పుష్పలత, పోతిన భవాని, అడ్వకేట్ పోతిన …

Read More »