Breaking News

Daily Archives: February 6, 2025

పారిశుద్ధ్య   నిర్వహణకు మినీ గార్బేజ్  ట్రాన్స్ఫర్ స్టేషన్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర  ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా సాంబమూర్తి రోడ్, ధర్నా చౌక్, పూర్ణానంద పేట  ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం సాంబమూర్తి రోడ్లో ఏర్పాటుచేసిన మినీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు, అటువంటి గార్బేజ్ స్టేషన్లు నగరంలో అవసరమైన …

Read More »

పార్కులను అభివృద్ధి చెయ్యండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పార్క్ అన్ని  అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మత్తు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్కు 33 డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్ర రత్న పార్కు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను …

Read More »

“ప్రముఖ వైద్యురాలు డా॥మారు మృతి”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు, నాస్తికోద్యమ నాయకులైన గోరా – సరస్వతీ గోరా నాల్గవ కుమార్తె డా॥మారు (80) ఈ రోజు (ఫిబ్రవరి 6, గురువారం) మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో కన్ను మూసారు. ఆమె ప్రముఖ వైద్యులు డా||సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హెూమ్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆమె అనేక గ్రామాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ సేవలందించడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకి ఎంతో కృషి చేసారు. కొన్ని వేలమంది పోలియో చిన్నారులకు ఉచితంగా …

Read More »

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ -2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు -అర్హులకే ఆర్థిక చేయూతనివ్వండి : మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వమందిస్తున్న బీసీ కార్పొరేషన్ల రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు గ్రౌండింగయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ …

Read More »

అత్యున్నత స్థానాల్లో బీసీ బిడ్డలు…ఇదే చంద్రబాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరేలా బీసీ బిడ్డలు సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణులై అత్యున్నత కొలువులు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకాంక్షించారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో మంత్రి …

Read More »

కులగణన అంటే వైసీపీ, తెదేపాలకు వణుకు, తెలంగాణ బీసీ ల ఉద్యమ స్పూర్తితో పోరు ఉదృతం

-బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా జే పూర్ణచంద్ర రావు -“బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలకు బాటవేసే దిశగా కార్యాచణ, శిక్షణ” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులగణన చేసి, ఆ వివరాలు బయటకి వస్తే బీసీలు నిలదీస్తారనే భయంతో ఆ నివేదికను నాడు వైసీపీ తొక్కిపెట్టిందని, ఇప్పుడు తెదేపా అసలుకే మోసం చేస్తూ కులగణనపై నోరుమెదపట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు అన్నారు. గురువారం విజయవాడలో ఏపీ బీసీ …

Read More »

మంత్రి గొట్టిపాటితో ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం భేటీ

-గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ఎగుమతులు, రాయతీలపై చర్చించిన ప్రతినిధులు -సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన స‌మ‌స్య‌లను పరిష్కరించేందు కృషి చేస్తాన‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అన్నారు. సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్ట‌రీ య‌జ‌మానులు, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ప్ర‌తినిధులు గురువారం స‌చివాల‌యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ తో భేటీ …

Read More »

మైనారిటీల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

-ముస్లిం మైనారిటీ అసోసియేష‌న్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూట‌మి ప్ర‌భుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఎల‌క్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేష‌న్ డైరీ, క్యాలెండ‌ర్ ను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫ‌రూక్ తో క‌లిసి మంత్రి గొట్టిపాటి గురువారం స‌చివాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ముస్లిం, మైనారిటీ ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అన్ని …

Read More »

ఎస్సీ యువతకు పెద్ద ఎత్తున శిక్షణ, ఉపాధి

-సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎం అజయ్ (ప్రధాన మంత్రి అనుచిత జాతి అభ్యున్నతి యోజన) స్కీం పై సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి ని ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ గురువారం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల సీడాప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు సీడాప్ నుంచి అందిస్తామని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు …

Read More »

మేరీస్ స్టెల్లా కళాశాలలో 36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మేరీస్ స్టెల్లా కళాశాలలో గురువారం విద్యార్థులతో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ లత కుమారి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఏ మోహన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సిస్టర్ రేఖ డైరెక్టర్ ఎక్సటెన్సిన్ యాక్టివిటీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి మాట్లాడుతూ నేడు …

Read More »