Breaking News

Daily Archives: February 24, 2025

వరి ఆహార వినియోగదారుల ప్రాధాన్యత బట్టి వరి రకాల ఎంపిక మరియు సాగు చేబట్టాలి

-కింజరాపు అచ్చె న్నాయుడు ,వ్యవసాయ శాఖ మంత్రి. -రాబోవు ఖరీఫ్ సీజన్ నారుమళ్ళు కోసం జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి . ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప కి లేఖ రాసిన వ్యవసాయ మంత్రి -వరి సాగు ప్రాంతాల వారీగా వినియోగ దారులు ఎంపిక చేసుకునే వరి రకాలు ,మెరుగైన మార్కెట్ ధర పొందే రకాల వివరాలను సీజన్ కు ముందు నుండే వివరాలను రైతులకు తెలపండి .- పరిశోధన సంచాలకులు Dr పి. సత్యనారాయణ కు తెలిపిన మంత్రి …

Read More »

ప్ర‌తిఒక్క‌రికీ బాధ్య‌తాయుత ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్యం

– ఆర్థిక అక్ష‌రాస్య‌త వారోత్స‌వాల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్‌, బ్యాంక‌ర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్‌బీఐ-ఆర్థిక అక్ష‌రాస్య‌త వారోత్స‌వాలు (ఫిబ్ర‌వ‌రి 24-ఫిబ్ర‌వ‌రి 28) సంద‌ర్భంగా సోమ‌వారం విజ‌య‌వాడ నోవాటెల్‌లో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్‌.. బ్యాంకింగ్ అధికారుల‌తో క‌లిసి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. 2016 నుంచి ఆర్‌బీఐ ఏటా అక్ష‌రాస్య‌త వారోత్స‌వాల‌ను ప్ర‌త్యేక ఇతివృత్తంతో నిర్వ‌హిస్తోందని.. ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు ఇతివృత్తంగా వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ …

Read More »

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– పోలింగ్ స్టేష‌న్లలో ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌లో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం న‌గ‌రంలోని ప‌ట‌మ‌ట బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌, ల‌యోలా క‌ళ‌శాల‌లోని వివిధ పోలింగ్ స్టేష‌న్ల‌ను …

Read More »

ఒక్క రూపాయి అద‌నంగా వ‌సూలు చేసినా స‌హించేది లేదు

– ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సుల ర‌ద్దుకూ వెనుకాడం – దీపం-2 అమ‌లు ప్ర‌గ‌తికి ల‌బ్ధిదారుల సంతృప్తే గీటురాయి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపం-2 ప‌థ‌కం ద్వారా అందించే ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌కు ల‌బ్ధిదారుల నుంచి అద‌నంగా ఒక్క రూపాయి వ‌సూలు చేసినా స‌హించేది లేద‌ని, ఫిర్యాదులు రుజువైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు ర‌ద్దుచేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. జిల్లాలో దీపం-2 ప‌థ‌కం అమ‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వే నివేదిక‌లు, ఫిర్యాదుల‌పై …

Read More »

పరిశ్రమల్లో బాయిలర్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలి

-జె. శ్రీనివాసరావు, విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో ఏర్పాటయ్యే బాయిలర్ ల నిర్వహణా విధానాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల పై బాయిలర్ ఆపరేటర్లకు పునఃశ్చరణ తరగతులను భోదించడం జరిగిందని విజయవాడ బాయిలర్ల ఉప ముఖ్య తనిఖీ అధికారి విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి జె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా బాయిలర్ల శాఖ ఆధ్వర్యంలో కృష్ణా …

Read More »

రూ. 1770 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ అప్పుల్ని ప్ర‌స్తుత ఎన్డీయే ప్ర‌భుత్వం తీర్చింది

-ఆరోగ్య సంర‌క్ష‌ణలో విప్ల‌వాత్మ‌క మార్పుల్ని తెచ్చామన్న గ‌వ‌ర్న‌ర్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ‌కు సంబంధించి పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.1770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చింద‌ని గౌర‌వ గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్దుల్ న‌జీర్ సోమ‌వారం ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి చేసిన‌ త‌మ‌ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మకత‌ ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. సుస్థిర ఆర్థిక …

Read More »

ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వృక్ష సంపద కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న వృక్షాన్ని ఎస్పీ కార్యలయం వద్ద నాటడం జరిగిందనీ, సమాజ హితం కోరే …

Read More »

ఇసుక రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక తనిఖీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ , తూర్పు గోదావరి జిల్లా వారి ఆదేశానుసారం జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం, టాస్క్ ఫోర్స్ S.I మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కొవ్వూరు వారు సంయుక్తంగా 24.02.2025న ఇసుక రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్లజెర్ల వద్ద తనిఖీ చేస్తున్నప్పుడు, చెల్లుబాటు అయ్యే వే బిల్లు లేకుండా మరియు అనుమతించబడిన సామర్థ్యం కంటే ఎక్కువ లోడ్‌తో ఇసుకను …

Read More »

మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవర, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి వివిధ చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు, ఏ.పి.ఈ.డి.సి.ఎల్ సంస్థ ప్రతినిధులు, వివిధ బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సోమవారం స్థానిక డి ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. మార్చ్ 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో, బాధితులకు తగు …

Read More »

ఆర్థిక అక్షరాస్యత వారం ఫిబ్రవరి 24-28

-కీలక ఆర్ధిక వ్యవహారాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది -థీమ్ “ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు”. -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ 2016 నుండి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని (FLW) నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ధిక అక్షరాస్యత గోడ ప్రతిని జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , జనాభాలోని నిర్దిష్ట …

Read More »