Breaking News

Daily Archives: February 24, 2025

గుంటూరు పర్యటనలో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్‌ (రాజా) తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం గుంటూరు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ క్లబ్‌ నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు సోమవారం గుంటూరు, తెనాలి, నాగార్జునయూనివర్శిటీ, మంగళగిరి పరిసర ప్రాంతాలలో పర్యటనలో భాగంగా ఓటర్లను అభ్యర్థించినట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల …

Read More »

మెప్మా సిఎంఎంలు, సిఓలు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో ఒకే రోజు లక్ష ఉత్పత్తులను అమ్మకం చేయడం ద్వారా గిన్నీస్ రికార్డ్ సాధించడానికి గుంటూరు నగరంలో ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మెప్మా సిబ్బందిని ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో …

Read More »

బుడమేరు ముంపు నిధులను జిఎంసికి రీ అంబర్స్ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడాది సెప్టెంబర్ లో విజయవాడలో జరిగిన బుడమేరు వరదల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆహార, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ మార్గదర్శకాల మేరకు వారు తెలిపిన బృందాలకు అందించామన్నారు. అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ ఖర్చు చేసిన …

Read More »

త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన ముందస్తు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వేసవిలో త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇంజినీరింగ్ అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉండవల్లి, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. సోమవారం కమీషనర్ ఉండవల్లి పంపింగ్ హౌస్ ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ తొలుత ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ, ఉండవల్లి …

Read More »

మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజు బకాయిలను మార్చి 15 వ తేదీ లోపు ఏజెన్సీల వారు చెల్లించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజు బకాయిలను మార్చి 15 వ తేదీ లోపు ఏజెన్సీల వారు చెల్లించాలని, లేని పక్షంలో సదరు హోర్డింగ్ లను తొలగించాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సోమవారం అడ్వర్టైజింగ్ ఏజెన్సిలతో మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కమీషనర్ ఛాంబర్ నందు బకాయిల వసూళ్ళ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సదరు సమావేశం నందు తొలుత, ఏజెన్సిల వారీగా నగర …

Read More »

పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27న జరగనున్న గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమీషనర్ ఛాంబర్ నందు యం.యల్.సి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన పై యం.యల్.సి ఎన్నికల విధులు కేటాయించబడిన నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు …

Read More »

అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణలంక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడున్న ఆహార నాణ్యత ప్రజలను అడిగి తెలుసుకున్నారు, కిచెన్ లో పరిశుభ్రతను స్వయంగా వీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని త్రాగునీరు సౌకర్యం నిరంతరాయంగా …

Read More »

విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం

-పోస్టర్లను అతికించుట నిషేదం -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున బహిరంగంగా బ్యానర్లు పోస్టర్లు ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపిన నియమ నిబంధనలను అతిక్రమించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం ఉదయం 50 వేల రూపాయల జరిమానా విధించారు. Prevention of Disfigurement of Open …

Read More »

పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. మైనర్, మీడియం, మేజర్ డ్రైన్ లన్ని డీసిల్టింగ్ పనులని పూర్తి చేయాలని …

Read More »

ఎఐఎంఎ మేనేజింగ్ ఇండియా అవార్డులలో  జెఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ‘దశాబ్దపు వ్యాపార నాయకుడు’ అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌ను ప్రపంచ సమ్మేళనంగా విస్తరించడంలో ఆయన చేసిన పరివర్తన నాయకత్వానికి గుర్తింపుగా, జెఎస్‌డబ్ల్యు  గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌కు 15వ ఎఐఎంఎ   మేనేజింగ్ ఇండియా అవార్డులలో ‘దశాబ్దపు వ్యాపార నాయకుడు’ గౌరవం లభించింది. ఈ అవార్డును ఈరోజు ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు గౌరవ అతిథి వాణిజ్యం మరియు పరిశ్రమలు; ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమక్షంలో జిందాల్‌కు ప్రదానం చేశారు. ఈ …

Read More »