Breaking News

Daily Archives: May 10, 2025

నేషన్ ఫస్ట్ అందరి నినాదం కావాలి.

-దేశంకోసం అంతా ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషం -ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం -ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు మద్దతుగా ఉందాం -భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ శుభపరిణామం -దేశ సమగ్రతకు ప్రధాని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి అండగా ఉంటుంది -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్‌ఫెయిత్ కార్యక్రమానికి హాజరైన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నేషన్ ఫప్ట్ నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, ఏ …

Read More »

చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు బేష్

-రాజమహేంద్రవరంలో గెయిల్ కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేసిన “చిన్నారి ఆరోగ్యం” కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -చిన్నారులను పోషకాహార లోపం నుండి సంపూర్ణ పోషణ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి కృషిని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ పి. ప్రశాంతిని అభినందించిన మంత్రి దుర్గేష్ -గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నఅంగన్ వాడీల పనితీరును కొనియాడిన మంత్రి దుర్గేష్ -పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు క్రమం తప్పకుండా …

Read More »

వీరజవాన్ మురళి నాయక్ మహారాష్ట్ర ప్రభుత్వం అండ

గోరంట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వీరజవాన్ మురళి నాయక్ మహారాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమత్ పేర్కొన్నారు. శనివారం గోరంట్ల మండలంలోనిగుమ్మయ్యగారి పల్లి కల్లి తండాలోని దేశం కోసం ప్రాణాలర్పిచ్చిన వీర జవాన్ అగ్నివీర్ మురళి నాయక్ గారి ఇంటిని సందర్శించి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పిచిమురళి నాయక్ తల్లి తండ్రి శ్రీరామ్ నాయక్ జ్యోతి బాయి లనుపరామర్శించి ఓదార్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ సిందే చరవాణి ద్వారా మురళి …

Read More »

వీర జవాన్ మురళీ నాయక్ కు ఏపీయూడబ్ల్యూజే ఘన నివాళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళి నాయక్ కు శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) ఘనంగా నివాళులర్పించింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చెందిన మురళి నాయక్ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్ సైనికుల పాశవిక దాడిలో గురువారం వీర మరణం చెందడం యావత్ జాతి గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు …

Read More »

అమర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లాలోని వైసిపి నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ – పాకిస్థాన్ యుద్ధంలో అమరుడైన మురళినాయక్ కు బందర్ రోడ్, స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం (సామజిక న్యాయ మహా శిల్పం) వద్ద సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,కార్పొరేటర్లు మరియు ఎన్టీఆర్ జిల్లాలోని వైసిపి నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన …

Read More »

భారత సైనికులకు అండగా నిలబడటం మనందరి బాధ్యత… : షేక్ ఖలీఫా తుల్లా బాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ.. ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాలకు వెళ్లి బుద్ధి చెబుతోంది. భారత్‌లోని పౌర ప్రాంతాలపై పాక్ చేస్తున్న దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోందని, దేశ రక్షణ, సమగ్రత కోసం పాకిస్థాన్‌తో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న భారత సైనికులకు అండగా నిలబడటం మనందరి బాధ్యతఅనీ భారతీయ జనతా మాజ్దూర్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫా తుల్లా బాషా అన్నారు. భారతీయ జనతా మాజ్దూర్ సెల్ …

Read More »

కరువు ప్రాంతాల్లో ఆర్‌డీటీ సేవలపై డైరెక్టర్ ఫెర్రర్ తో చర్చించిన మంత్రి సత్యకుమార్

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురంలో ఆర్‌డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ లు కలిశారు. కరువు ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఆర్‌డీటీ అందిస్తున్న సేవల గురించి చర్చించారు. ఆర్‌డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి లెటర్ రాసిట్లు మంత్రి సత్యకుమార్ ఈ సందర్బంగా గుర్తుచేశారు. రాజకీయాలకతీతంగా కరువు ప్రాంతాల్లో పేదలు, మధ్య తరగతి ప్రజల విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, …

Read More »

అన్ని ప్రభుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రుల్లో జన ఔషధి మందుల షాపులు

-నాణ్య‌మైన జ‌న‌రిక్ మందుల‌ను అతి త‌క్కువ రేట్ల‌కు అందించ‌డం ల‌క్ష్యం -లాభాపేక్ష లేని ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిర్వ‌హ‌ణ‌ -ఏరియా, జిల్లా ఆసుప‌త్రుల్లోనూ ప్ర‌వేశం పెట్టాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పెద్ద సంఖ్య‌లో ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే రోగుల ప్ర‌యోజ‌నార్ధం నాణ్య‌మైన జ‌న‌రిక్ మందుల‌ను అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే అందించ‌డానికి అన్ని ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రుల్లో జ‌న ఔషధి కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ విష‌యంపై స‌మీక్షానంత‌రం ఆరోగ్య మంత్రి …

Read More »

ఈ నెల 12న తిరువూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

– తిరువూరు డివిజ‌న్ ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – క‌లెక్ట‌రేట్‌లోనూ అర్జీలు స‌మర్పించేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12వ తేదీ సోమవారం తిరువూరు డివిజన్ లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం తిరువూరులో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) జిల్లా స్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖ‌ల …

Read More »

41°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం(11-05-25) 41°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు-11, అనకాపల్లి జిల్లా-8 మండలాల్లో తీవ్రవడగాలులు(19), మరో 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సోమవారం 24 మండలాల్లో తీవ్ర,57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు అల్లూరి సీతారామరాజు-8, అనకాపల్లి-16, అనంతపురం-4, అన్నమయ్య-1, చిత్తూరు జిల్లా కుప్పం మండలాల్లో(30) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. వడగాలులు వీచే …

Read More »