Breaking News

Daily Archives: May 26, 2025

ఆవేద‌నను ఆలకించారు.. ట్రై సైకిళ్లు అందించారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల ఆవేద‌న‌ను ఆల‌కించి ఆపై స‌త్వ‌రం స్పందించి మూడు చ‌క్రాల సైకిలును అంద‌జేసి జీవిత మార్గానికి బాటవేసిన జిల్లా యంత్రాంగం.. ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి ప‌రిష్కరించే కార్య‌క్ర‌మ‌మైన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) దివ్యాంగుల జీవ‌న మార్గానికి బాట‌లు వేసింది. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్‌లో ఒక కార్య‌క్ర‌మాన్ని ముగించుకొని ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో దివ్యాంగుణ్ని చూసి చ‌లించి అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి అర్జీని స్వీక‌రించి అదేరోజు బాధితునికి మూడు …

Read More »

మ‌హాత్ముని ఆశ‌యాల కీర్తి శిఖ‌రం గాంధీ కొండ‌పై యోగాంధ్ర‌

– జిల్లాలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు కలిగి ఉండాల‌ని చెబుతూ.. దేహాన్ని దేవాల‌యంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌మిచ్చిన మ‌హాత్ముని ఆశ‌యాల కీర్తి శిఖ‌రమైన గాంధీ కొండ‌పై యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్స‌వాల సంద‌ర్భంగా సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని గాంధీ హిల్‌పై గాంధీ హిల్ ఫౌండేష‌న్‌, జిల్లా యంత్రాంగం, ఏపీ …

Read More »

త‌నువు మ‌న‌సును ఏకం చేసి…

-సుసంప‌న్న ఆరోగ్యానికి బాట‌లు వేసి.. – యోగాచ‌ర‌ణ‌తో దేహ దారుఢ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్య‌మూ సొంతం – ప్ర‌తి కుటుంబానికి, ప్ర‌తి వ్య‌క్తికీ యోగానుllp చేరువ‌చేసేందుకే యోగాంధ్ర‌ – 26 జిల్లాల్లో, 26 రోజుల‌పాటు 26 ఇతివృత్తాల‌తో థీమ్ యోగా కార్య‌క్ర‌మాలు – రాష్ట్ర వ్యాప్తంగా 104 ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు – క‌నీసం రెండు కోట్లమందికి యోగాను చేరువ‌చేసేందుకు కృషి – ప్ర‌తిఒక్క‌రూ త‌మ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి – రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (వైద్య ఆరోగ్యం, …

Read More »

ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి

–విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు  ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్  నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు  స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం …

Read More »

“కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర!”… : తిరుపతి ఎంపి గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపిందన్నారు. ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం “రెడ్ బుక్” రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. …

Read More »

తపాలా శాఖా NPCI ఖాతాల ద్వారా ప్రభుత్వ పధకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానం మరియు NPCI లింకేజ్ చేయుట తప్పనిసరి అని అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని పోస్టల్ డిపార్ట్మెంట్ కు GSWS డిపార్టుమెంటు వారు లిఖిత పూర్వక సందేశం ఇచ్చినట్టు సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోస్టాఫిసెస్, విజయవాడ డివిజన్ ఎమ్.నరసింహ స్వామి విలేకరులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ దలచిన సంక్షేమ పథకాలు “తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ’ …

Read More »