Breaking News

Daily Archives: May 26, 2025

బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాన్ని అమర ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు

-ప్రాంతీయ రవాణా శాఖాధికారి మురళి మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం – మే 27, 2025 సందర్భంగా మంగళంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయం (ఆర్టిఓ) సహకారంతో ” కార్డియో పల్మనరీ రిససిటేషన్” (CPR) మరియు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాన్ని అమర్ ఆసుపత్రి తిరుపతి వారు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రాంతీయ రవాణా శాఖా ధికారి తిరుపతి కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అత్యవసర సమయంలో …

Read More »

అప్పు చేసిన పాపానికి నా తొమ్మిదేళ్ల కుమార్ని బలి తీసుకున్న దుండగులు… : అంకమ్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా భర్త చేసిన అప్పు తీర్చమని కొడుకుని తాకట్టు పెట్టుకుని ఆపై క్రూరంగా హత్య చేసారని కన్నీటి పర్యాంతమైంది తల్లి. హత్యకు గురైన బాలుడి తల్లి అంకమ్మ. కేవలం 15 వేలు అప్పు చేసిన నేరానికి కుటుంభంతో సహా వెట్టి చాకిరీ చేయించుకొని చివరకు 9 ఏళ్ల బిడ్డను హత్య చేసిన దుండగుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. …

Read More »

టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి ఎస్ సవిత పరిశీలన

కడప, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ మహానాడు ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సోమవారం పర్యవేక్షించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో మహానాడు ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. మంగళవారం నుంచి టీడీపీ మహానాడు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పన నిర్వహించిన సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి …

Read More »

20 రోజు ఎపి మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల జీతం పెంపుదల కోసం నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సోమవారం ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 20 రోజు నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు పిట్టా మహేష్‌బాబు మాట్లాడుతూ… అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు డ్రైనేజీ, పార్క్‌లు, మెకానిక్‌లు, టౌన్‌ ప్లానింగ్‌ మరియు ఇంజనీరింగ్‌ అన్ని విభాగాల వారికి టెక్నికల్‌ రూ. 29,200, నాన్‌ టెక్నికల్‌ రూ.24,500 జీతాలు చెల్లించాలని, 10 …

Read More »

ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన ప్రమాణాలు పెంచుటకు శిక్షణ

-పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి. IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., అన్నారు. సోమవారం కె.ఎల్. యూనివర్శిటీ (వడ్డేశ్వరం, గుంటూరు)లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 416 రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లు (SRPs) కోసం మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టెండర్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి సంబంధిత అధికారులతో మంగినపూడి బీచ్ ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ నెల మొదటి వారంలో జరగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలను కట్టుదిట్టంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందులో …

Read More »

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానం 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, వెంకటగిరిలోగల ఎస్ పీ కే యం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు 53 సీట్లకు, తమిళనాడులోని సేలం నందు 12 సీట్లకు, కర్ణాటకలోని గడగ్ నందు 4 సీట్లకు మూడు సంవత్సరముల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ టెక్నాలజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తులను వచ్చే జూన్ నెల 1వ తేదీ వరకు ఆహ్వానిస్తున్నట్లు ఆ ఇన్స్టిట్యూట్ ఓ. ఎస్. డి ఎస్ గిరిధర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

పుస్తక రూపంలో జిల్లా ప్రగతి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రగతిని పుస్తక రూపంలో తీసుకురానున్నామని, అందుకు సంబంధించిన ప్రగతి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పుస్తకం తయారీ కోసం వివిధ ప్రభుత్వ శాఖలు సమర్పించవలసిన ప్రగతి నివేదికపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సర కాలంగా సాధించిన ప్రగతిపై ఒక పుస్తకం తయారు చేస్తున్నామని, వివిధ …

Read More »

జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు రోజురోజుకు ముమ్మరం అవుతున్నాయి….

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నంలో జరిగే యోగ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండడం రాష్ట్రానికే గర్వకారణంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజానీకం పాల్గొనే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలో దాదాపు 8 లక్షల మంది పాల్గొనే విధంగా ఈనెల 21వ తేదీ నుండి వచ్చే జూన్ నెల …

Read More »

అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందుతున్న అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, ఆర్డిఓ కే స్వాతి లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక—మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల …

Read More »