విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ఏపీ క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభకనబరచడం పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరానికి చెందిన ఎస్.పల్లవి వెయిట్ లిఫ్టింగ్ 71కేజీల మహిళా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి పల్లవిని ఫోన్ ద్వారా శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారిణి పల్లవి విజయం రాష్ట్రప్రజలందరూ గర్వించదగ్గ విషయమన్నారు.
Read More »Monthly Archives: February 2025
గోదావరి-బనకచర్లతో సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు
-సీమలో ఎన్టీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే నేను ముందుకు తీసుకెళ్లా -గత ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్వీర్యం.. త్వరలోనే శ్రీనివాసపురం కెనాల్‌కు టెండర్లు -పెన్షన్ల పెంపుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాం -2047 పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం -చెప్పిన దాని కంటే ఎక్కువ పనులు చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను -రాష్ట్రానికి 7 నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం -వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టిన రూ.22,252 కోట్ల బకాయిలు చెల్లించాం -గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారు -రాయచోటి …
Read More »చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి నేలలు ప్రధానమైనవి. ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలి. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలు… కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలు. ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25,000 …
Read More »వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్
-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశాల చెంతన నిలిపేందుకు వికసిత్ భారత్ విజన్ ను ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు …
Read More »పి.బి. సిద్ధార్థ ఎన్.సి.సి. బాలికల గిన్నిస్ రికార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలకు చెందిన ఎన్.సి.సి. 4 వ ఆంధ్రా బాలికల బెటాలియన్ విద్యార్థినులు బి.గ్రీష్మ, కె.గాయత్రి ఇతర రాష్ట్రాల బాలికల 8 క్యాడెట్‌లతో కలిసి 2 నిమిషాల్లో 12 నృత్య రూపాలను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇద్దరూ స్థానం సంపాదించారు. జనవరి 27న ఢిల్లీలో జరిగిన పి.ఎం. ర్యాలీలో వారు పాల్గొని ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి …
Read More »జువెనైల్స్ కు చిత్రలేఖనం శిక్షణా తరగతులు
-సుజనా ఫౌండేషన్ చొరవతో నైపుణ్యాభివృద్ధి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో చిత్రలేఖనం శిక్షణా తరగతులను శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, సుజనా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని చిత్రలేఖనం తరగతులను ప్రారంభించారు. తెలిసి తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్ లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సుజనా ఫౌండేషన్ ద్వారా చిత్రలేఖనంలో శిక్షణనివ్వడానికి …
Read More »“మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు…..
-శాసనమండలి ( ఎంఎల్ సి) పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం….. -అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు….. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత …
Read More »నగరంలో నవీకరించిన “జోస్ అలుక్కాస్” షోరూమ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో విస్తృత స్థాయిలో నవీకరించిన జోస్ అలుక్కాస్ షోరూమ్ పున ప్రారంభించబడినది. నగరంలో ఎంజీ రోడ్డు లో శనివారం తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించబడినది. సెలబ్రిటీ అతిథిగా సినీ నటి సభానటేష్ , జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు , వరీ్్ఘస్ అలుక్కాస్ , పాల్ జె .అలుక్కాస్ ,మరియు జాన్ అలుక్కాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోస్ అలుక్కాస్ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా నవీకరించిన షోరూం సాంప్రదాయం ,ఆధునిక డిజైన్లతో …
Read More »కోట్లాదిమంది ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్
-కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ పురందేశ్వరి స్పందన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర వార్షిక బడ్జెట్ కోట్లాది మంది భారతీయ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు,ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈరోజు పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆమె స్పందించారు. ఆర్ధికవృద్ధిని, దేశ అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో కీలకంగా వ్యవహరించే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ …
Read More »ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించొద్దు
-ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దు. -యం.వి. ఇన్స్పెక్టర్ ఎం నారాయణ రాజు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రయాణికుల ప్రాణాలతో చేలాగటలొద్దని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎం నారాయణరాజు అన్నారు. రోడ్డు భద్రత మసోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సుని శనివారంనాడు పట్టణంలోని రవాణాశాఖ యూనిట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎం వి ఇన్స్పెక్టర్ నారాయణరాజు మాట్లాడుతూ డ్రైవర్లు వాహనదారులు పాదచారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని అన్నారు.ఆటోలలో ఎక్కువమందిని ఎక్కించుకొని …
Read More »
Prajavartha Online Telugu News