రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రామదాసు పేట, సుబ్బారావు నగర్ ప్రాంతాలలో మెటల్ కోసం తవ్విన క్వారీలలో ఏర్పడిన గుంటలను పూడ్చే విషయమై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ ఎమ్ సి, మైన్స్, ఆర్ అండ్ బి తదితర సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.. నగరం సమీపంలోని , రామదాసు పేట, సుబ్బారావు నగర్ …
Read More »Daily Archives: May 13, 2025
జిల్లా లో మే 19 నుంచి మే 28 వ తేదీ వరకు పదవ తరగతి , ఓపెన్ స్కూల్ పదవ, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు.
-విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా పకడ్బందీ ఏర్పాట్లు -డిఆర్ఓ, టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో మే 19 నుంచి మే 28 వ తేదీ వరకు పదవ తరగతి , ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ డీఆర్వో ఛాంబర్ లో పదో తరగతి , సప్లమెంటరీ పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం …
Read More »మద్దతు ధర కల్పించే క్రమంలో కొనుగోళ్లు ఉండాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి మద్దతు ధర కల్పించే క్రమంలో కొనుగోళ్లు ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాకి నిర్దేశించిన 2.30 లక్షల మెట్రిక్ …
Read More »హెచ్ ఐ వి/ ఎయిడ్స్ పై జానపద కళాజాత (వీధినాటిక) ప్రచార కార్యక్రమము
-డా ఎన్ వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమములో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ (దిశ) ఆధ్వర్యంలో జిల్లాలో హెచ్ ఐ వి /ఎయిడ్స్ పై జానపద కళాజాత (వీధి నాటిక) ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ అధికారి డా.ఎన్. వసుంధర తెలిపారు. మంగళవారం స్థానిక వాంబే కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రచార కార్యక్రమాన్ని వసుంధర ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.ఎన్. వసుంధర …
Read More »ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర- యోగ శక్తి సాధన సమితి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని యోగ శక్తి సాధన సమితి భారతదేశ వ్యాప్తంగా ‘ఇంటింటికి మోడీ ఫిట్నెస్ మంత్ర’ ను అందించాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. దేశంలో రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు,సర్జరీలు అర్ధంతర చావులు తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్రతో సాధ్యమే అన్నారు. యోగ, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలను అనేక సంవత్సరాలుగా ప్రజలకు అవగాహన,చికిత్స, శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్న కోర్సు డైరెక్టర్ …
Read More »ఈనెల 22వ తేదీ నాటికి 910 ఇళ్ళు పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించి ఈనెల 22వ తేదీ నాటికి 910 ఇళ్ళు పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే చాలా వెనుకబడి ఉండటంతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …
Read More »జాతీయ రహదారి వరకు డ్రైన్ ని సమగ్రంగా సర్వే చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ నగరం నుండి వెళ్లే మొండి గేటు నుండి జాతీయ రహదారి వరకు డ్రైన్ ని సమగ్రంగా సర్వే చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ పాత గుంటూరు మొండిగేటు, బాలాజీ నగర్, వెహికిల్ షెడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొండిగేటు …
Read More »అధికారులు సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.టి అగ్రహారం రోడ్డు విస్తరణ, చుట్టుగుంట చెరువు అభివృద్ధి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయటానికి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, అధికారులతో కలిసి చుట్టుగుంట చెరువు దగ్గర నుండి కంకరగుంట ఆర్.యు.బి వరకు జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనులు పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ తొలుత …
Read More »చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిసిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విజయవాడలోని బందర్ రోడ్డులోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు తెలిపాయి.
Read More »రాబోయే రోజుల్లో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి…
-జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ వేసవిలో రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యం. సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి …
Read More »
Prajavartha Online Telugu News